NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / శాకుంతలం ట్రైలర్ రిలీజ్: గుణశేఖర్ మాటలకు ఏడ్చేసిన సమంత
    తదుపరి వార్తా కథనం
    శాకుంతలం ట్రైలర్ రిలీజ్: గుణశేఖర్ మాటలకు ఏడ్చేసిన సమంత
    శాకుంతలం ట్రైలర్ రిలీజ్

    శాకుంతలం ట్రైలర్ రిలీజ్: గుణశేఖర్ మాటలకు ఏడ్చేసిన సమంత

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jan 09, 2023
    03:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సమంత నటించిన మొట్టమొదటి పాన్ ఇండియన్ మూవీ శాకుంతలం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.

    ఈ నేపథ్యంలో ఈరోజు శాకుంతలం ట్రైలర్ ని లాంచ్ చేసింది చిత్రబృందం. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమ కథని తెర మీద చూపించబోతున్నామని ట్రైలర్ లో ప్రకటించారు.

    విశ్వామిత్రుడు, మేనకల కూతురు శకుంతల, దుశ్యంతుడి ప్రేమలో ఎలా పడిందీ, వారిద్దరి ప్రేమ జీవితం, ఆ తర్వాత దుష్యంతుడు శకుంతలను తిరస్కరించడం సహా అన్నీ ట్రైలర్ లో చూపించారు.

    సినిమాని చాలా కలర్ ఫుల్ గా కన్నుల విందుగా తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.

    శాకుంతలం

    ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఏడ్చేసిన సమంత

    ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని చాలా ఘనంగా ప్లాన్ చేసింది చిత్రబృందం. ఇక్కడ గుణశేఖర్ మాట్లాడుతూ, శాకుంతలం సినిమాలో ఇద్దరు కథానాయకులు ఉన్నారని, కథ పరంగా దేవ్ మోహన్ హీరో అయితే సినిమా పరంగా హీరో సమంత అని చెప్పుకొచ్చారు.

    ఈ మాటలతో సమంత కళ్ళలోంచి కన్నీళ్ళు వచ్చాయి. భావోద్వేగాన్ని ఆపుకోలేక కన్నీళ్ళు కార్చింది సమంత. ఈ లాంచ్ లో సమంత మాట్లాడుతూ, ఈ ట్రైలర్ లాంచ్ కి ఎలాగైనా రావాలని ఫిక్స్ అయ్యానని, అందుకే బలం తెచ్చుకుని ఇక్కడికి వచ్చానని అంది.

    సమంత కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా, పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాలం భాషల్లో విడుదల అవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సమంత రుతు ప్రభు
    తెలుగు సినిమా

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    సమంత రుతు ప్రభు

    సమంతకు ధైర్యం చెబుతూ రాహుల్ రవీంద్ర గిఫ్ట్.. ఆందోళనలో అభిమానులు టాలీవుడ్
    కొత్త సంవత్సరంలో ఏం చేయాలో చెబుతూ సమంత ఎమోషనల్ పోస్ట్ టాలీవుడ్
    సమంత శాకుంతలం రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ విషయంలో బాధపడుతున్న అభిమానులు తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    ఆర్ఆర్ఆర్ దూకుడుతో పవన్ అభిమానులు హ్యాపీ.. కారణం అదే పవన్ కళ్యాణ్
    2022 సంవత్సరాన్ని మంచి సినిమాతో ముగించాలనుకుంటున్నారా? ఈ లిస్ట్ చూడండి టాలీవుడ్
    షూటింగ్ సెట్లో ప్రభాస్, మారుతి.. ఫోటోలు వైరల్ టాలీవుడ్
    అది వినగానే పవన్ కళ్యాణ్ చప్పట్లు కొట్టారు.. ఖుషీ నిర్మాత ఏఎమ్ రత్నం పవన్ కళ్యాణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025