
Samantha: ఇన్‌స్టాలో సమంత పెట్టిన స్టోరీలు వైరల్.. ఏంటంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ,సమంత తాజాగా పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.
సమంత తన బంధువు నిక్‌డోస్ చేసిన ఒక పోస్ట్‌ను షేర్ చేశారు.
ఆ పోస్ట్‌లో నిక్‌డోస్ "ప్రపంచంలో మంచి వదినలు కూడా ఉంటారు.నా వదినను నేను ఎప్పటికీ ప్రేమిస్తాను" అని చెప్పారు.
దీనిని సమంత "లవ్ యూ" అని కామెంట్ చేసి షేర్ చేశారు.
అంతే కాకుండా, తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 'సిటడెల్' చిత్ర బృందంతో దిగిన ఒక ఫోటోను కూడా పంచుకున్నారు.
ఈ టీమ్‌తో పనిచేయడం ఒక అద్భుతమైన అనుభూతి అని ఆమె పేర్కొన్నారు.
అలాగే,"సిటడెల్ : హనీ బన్నీ"కోసం రాజ్ అండ్ డీకేతో కలిసి పనిచేయడం తనకు గర్వకారణమని తెలిపిన సమంత,ఈ అనుభూతిని అభిమానులతో పంచుకున్నారు.
వివరాలు
ఈ అమ్మాయిలాగా పోరాడండి
ఇన్‌స్టాగ్రామ్‌లో స్ఫూర్తి ప్రదమైన వీడియోలను తరచూ పంచుకునే సమంత, తాజాగా ఒక వీడియోను షేర్ చేశారు.
ఈ వీడియోలో అబ్బాయి, అమ్మాయి మధ్య జరిగిన కుస్తీ పోటీని చూపించారు.
పోటీలో, అబ్బాయి పూర్తి ఆత్మవిశ్వాసంతో పోటీలోకి ప్రవేశిస్తాడు. కానీ పోటీ ముగిసే సమయానికి, అతడు అమ్మాయి చేతిలో ఓడిపోతాడు.
ఈ వీడియోకు "ఈ అమ్మాయిలాగా పోరాడండి" అంటూ సమంత క్యాప్షన్ పెట్టారు.
ప్రస్తుతం ఈ ఇన్‌స్టా స్టోరీలు పెద్దమొత్తంలో వైరల్‌గా మారి, అభిమానులు వాటి గురించి చర్చిస్తున్నారు.