Samantha: సమంత 'మా ఇంటి బంగారం' రిలీజ్ డేట్ ఫిక్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఒకప్పుడు వరుస సినిమాలతో దుమ్మురేపిన స్టార్ హీరోయిన్ సమంత వెండి తెరపై కనిపించి చాలా ఏళ్లు అవుతోంది. ఆమె చివరిగా విజయ్ దేవరకొండ హీరోగా, శివనిర్వాణ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఖుషి సినిమాలో హీరోయిన్‌గా నటించారు. ఆ సినిమా తర్వాత ఆమె నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ 'మా ఇంటి బంగారం' ప్రేక్షకుల్లో మంచి హైప్‌ను సృష్టించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సమంత ఉన్న పోస్టర్‌లో సూచించబడినట్లుగా, ఈ సినిమా 2026 మే 15న గ్రాండ్‌గా రిలీజ్ కానుందని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాకు సమంత భర్త రాజ్ నిడుమోరు కథ అందించగా, దర్శకత్వం నందిని రెడ్డి పని చేస్తున్నారు.
Details
మార్చి 15న రిలీజ్
నిర్మాణ బాధ్యతలు త్రలాల మూవింగ్ పిక్చర్స్ సంస్థకు ఉండగా, సంగీతం సంతోష్ నారాయణన్ అందిస్తున్నారు. గతంలో విడుదలైన టీజర్‌కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. టీజర్‌లో కుటుంబ భావోద్వేగాలు, వినోదం, మాస్ యాక్షన్ అన్ని సమన్వయంగా ఉంటూ కథాంశాన్ని ఆకట్టుకోవడం గమనార్హం. సమంత చేసిన ఫైట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో యాంకర్ శ్రీముఖి కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. టీజర్‌తోనే ఆకట్టుకున్న సమంత పూర్తి సినిమా ఫ్లెడ్జ్ విజువల్స్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్‌తో ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరించబోతుందో మే 15న వెండి తెరపై చూడాల్సిందే.