
Raj Nidimoru and Samantha: రాజ్ నిడిమోర్‌తో డేటింగ్ రూమర్స్‌పై సమంత టీమ్ క్లారిటీ!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ ప్రముఖ నటి సమంత, 'ఫ్యామిలీ మాన్', 'ఫర్జీ' వంటి హిట్ వెబ్ సిరీస్‌ల దర్శకుడైన రాజ్ నిడిమోర్ డేటింగ్‌లో ఉన్నారన్న వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
సమంత నిర్మాణంలో రూపొందిన తాజా చిత్రం 'శుభం'కు రాజ్ నిడిమోర్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని విజయవంతంగా దూసుకుపోతోంది.
సినిమా విజయంతో పాటు, సమంత - రాజ్ కలిసి పలుచోట్ల దర్శనం ఇచ్చిన నేపథ్యంలో ఈ జోడీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో రూమర్లు వేగంగా వ్యాపించాయి.
Details
అవి కేవలం పుకార్లు మాత్రమే
అంతేకాక, రాజ్ నిడిమోర్ తన భార్యకు విడాకులు ఇచ్చారన్న కథనాలు కూడా చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో తాజాగా సమంత మేనేజర్ స్పందించారు.
సమంత - రాజ్ మధ్య వ్యక్తిగత సంబంధాల గురించి వస్తున్న వార్తలు కేవలం పుకార్లే అని స్పష్టం చేశారు.
అలాగే రాజ్ తన భార్యకు విడాకులు ఇచ్చారని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఖండించారు.
గతంలో సమంత, రాజ్ - డీకే దర్శకత్వంలో తెరకెక్కిన 'ది ఫ్యామిలీ మాన్ 2', 'సిటడెల్: హనీ బన్నీ' వంటి ప్రాజెక్టుల్లో నటించిన సంగతి తెలిసిందే.