LOADING...
Samantha: అఖిల్‌కు శుభాకాంక్షలు తెలిపిన సమంత.. 'లెనిన్' బ్లాక్‌బస్టర్ అంటూ స్పందన
అఖిల్‌కు శుభాకాంక్షలు తెలిపిన సమంత.. 'లెనిన్' బ్లాక్‌బస్టర్ అంటూ స్పందన

Samantha: అఖిల్‌కు శుభాకాంక్షలు తెలిపిన సమంత.. 'లెనిన్' బ్లాక్‌బస్టర్ అంటూ స్పందన

వ్రాసిన వారు Moogati Shabari
Jul 10, 2026
05:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

సుమారు మూడేళ్ల విరామం అనంతరం హీరో అక్కినేని అఖిల్ 'లెనిన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా నటి సమంత చిత్రబృందానికి, ముఖ్యంగా అఖిల్‌కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. మురళీకిశోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ ప్రధాన పాత్రలో రూపొందిన 'లెనిన్' చిత్రం నేడు విడుదలైంది. విడుదలైన తొలి రోజే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందాన్ని ట్యాగ్ చేస్తూ సమంత తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ప్రత్యేక పోస్ట్ చేశారు.

వివరాలు

ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు..

'''లెనిన్' టీమ్‌కు, ముఖ్యంగా అఖిల్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇప్పటికే ఈ సినిమా బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకెళ్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి'' అని పేర్కొంటూ ట్రైలర్‌ను కూడా షేర్ చేశారు. ఇక ఇటీవల సమంత ప్రధాన పాత్రలో వచ్చిన 'మా ఇంటి బంగారం' మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా గురించి అఖిల్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వివరాలు

సమంతకు ప్రశంసల వెల్లువ..

ఆ చిత్రంలోని కథా ఆలోచన తనకు ఎంతో నచ్చిందని చెప్పారు. ఒక కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టి, తన వ్యక్తిత్వంతో అందరి మనసులు గెలుచుకుని 'బంగారం'గా గుర్తింపు పొందే అంశంతో పాటు, అదే పాత్రలో శక్తివంతమైన యాక్షన్‌ను చూపించడం చాలా ఆకట్టుకుందని వెల్లడించారు. ముఖ్యంగా మహిళా పాత్రకు అంతటి యాక్షన్‌కు ప్రాధాన్యం ఇవ్వడం ప్రశంసనీయమని, సమంత తన పాత్రను అద్భుతంగా ఆవిష్కరించారని ఆయన అభినందించారు.

Advertisement