
AlluAravind : సంధ్య థియేటర్ ఘటన.. శ్రీతేజ కుటుంబానికి రూ.2 కోట్ల విరాళం
ఈ వార్తాకథనం ఏంటి
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ కిమ్స్ ఆసుపత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు ఆయన ఆరోగ్యంపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం అల్లు అరవింద్ మాట్లాడుతూ డాక్టర్లతో మాట్లాడి శ్రీతేజ పరిస్థితి గురించి తెలుసుకున్నామని, ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని వారు చెప్పారు.
త్వరలోనే పూర్తిగా కోలుకుంటాడని ఆశిస్తున్నామని, కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలనుకున్నామని చెప్పారు.
అందులో భాగంగా అల్లు అర్జున్ రూ. 1 కోటి, మైత్రీ మూవీస్ నిర్మాతలు రూ. 50 లక్షలు, దర్శకుడు సుకుమార్ రూ. 50 లక్షలు అందజేస్తున్నారు.
Details
రేపు సీఎంను కలవనున్న సినీ పెద్దలు
ఈ మొత్తం సాయాన్ని ప్రభుత్వ ప్రతినిధి దిల్ రాజు చేతుల మీదుగా అందజేస్తున్నామని, ఈ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా తాము అండగా ఉంటామని తెలిపారు.
T FDC చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ శ్రీతేజ ఆక్సిజన్ లేదా వెంటిలేటర్ సాయం లేకుండా 72 గంటలుగా శ్వాస తీసుకుంటున్నాడు.
ఇక అల్లు అర్జున్, నిర్మాతలు, దర్శకులు కలిసి రూ. 2 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేశారు.
రేపు ఉదయం 10 గంటలకు సినీ పరిశ్రమ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు.