Loading...
Sardar 2 ott release: ఓటీటీలోకి 'సర్దార్‌ 2' ఎంట్రీ.. కార్తి మూవీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
ఓటీటీలోకి 'సర్దార్‌ 2' ఎంట్రీ.. కార్తి మూవీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Sardar 2 ott release: ఓటీటీలోకి 'సర్దార్‌ 2' ఎంట్రీ.. కార్తి మూవీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 28, 2026
02:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ కథానాయకుడు కార్తి ప్రధాన పాత్రలో పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌హిట్‌ మూవీ 'సర్దార్‌' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రానికి కొనసాగింపుగా ఇటీవల 'సర్దార్‌ 2' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాళవిక మోహనన్‌, ఆషికా రంగనాథ్‌ కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో ఎస్‌.జె.సూర్య, రజిషా విజయన్‌ కీలక పాత్రలు పోషించారు. 'సర్దార్‌'కు సీక్వెల్‌గా తెరకెక్కిన 'సర్దార్‌ 2' సెప్టెంబరు 10న (Sardar 2 Release Date) థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

వివరాలు

అక్టోబర్ 1న స్ట్రీమింగ్

ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో అక్టోబరు 1వ తేదీ నుంచి (Sardar 2 OTT Release Date) స్ట్రీమింగ్‌ కానుంది.

తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ 'సర్దార్‌ 2' అందుబాటులోకి రానుంది.

దీంతో థియేటర్లలో ఈ సినిమాను మిస్‌ అయిన ప్రేక్షకులు ఓటీటీలో వీక్షించే అవకాశం లభించనుంది.

వివరాలు

ఇంతకీ 'సర్దార్‌ 2' కథేంటి?

'సర్దార్‌' కథ ఎక్కడైతే ముగిసిందో.. అక్కడి నుంచే 'సర్దార్‌ 2' (Sardar 2 Movie) కథ ప్రారంభమవుతుంది.

ఇన్‌స్పెక్టర్‌ నుంచి రా ఏజెంట్‌గా మారిన విజయ్‌ (కార్తి).. రా చీఫ్‌ మనోజ్‌ బొమ్మై (ఆశిష్‌ విద్యార్థి)కి తెలియకుండా ఓ రహస్య ఆపరేషన్‌ను ప్రారంభిస్తాడు.

భారత ఇంటెలిజెన్స్‌ బ్యూరోకు కూడా తెలియకుండా మాజీ రా ఏజెంట్‌ వాల్‌రస్‌ (అచ్యుత్‌ కుమార్‌)ను వెతికి పట్టుకునేందుకు విజయ్‌ రంగంలోకి దిగుతాడు.

అయితే అప్పటికే వాల్‌రస్‌ను యోగానంద్‌ (ఎస్‌జే సూర్య) నేతృత్వంలోని ప్రమాదకరమైన బ్లాక్‌ డ్యాగర్‌ ముఠా వెంటాడుతుంటుంది.

బ్లాక్‌ డ్యాగర్‌ ముఠా జరిపిన దాడిలో వాల్‌రస్‌ తీవ్రంగా గాయపడి చివరకు కన్నుమూస్తాడు.

ADVERTISEMENT

వివరాలు

సర్దార్ ఎలాంటి సాహసాలు చేశాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే

అయితే చనిపోయే ముందు విజయ్‌కు 'మిషన్‌ డోకు' అంటూ కత్తి ఆకారంలో ఉన్న ఓ తాళాన్ని అందిస్తాడు.

అంతేకాదు.. మరో పది రోజుల్లో దేశంలో భారీ విధ్వంసం జరగబోతోందని విజయ్‌ను హెచ్చరించి ప్రాణాలు విడుస్తాడు.

అసలు 'మిషన్‌ డోకు' ఏమిటి? దేశాన్ని నాశనం చేసేందుకు బ్లాక్‌ డ్యాగర్‌ ముఠా పన్నిన కుట్ర ఏంటి? ఈ కుట్రను ఛేదించేందుకు విజయ్‌ ఎలాంటి చర్యలు చేపట్టాడు? తన తండ్రి సర్దార్‌తో కలిసి విజయ్‌ ఎలాంటి సాహసాలు చేశాడు?

చివరకు దేశాన్ని విధ్వంసం నుంచి ఎలా కాపాడారు? అన్నదే 'సర్దార్‌ 2' కథ.

ADVERTISEMENT