Loading...
Mojtaba Khamenei: మొజ్తబాపై రెండుసార్లు అమెరికా దాడి.. శిథిలాల్లో కొన ఊపిరితో గుర్తింపు!
మొజ్తబాపై రెండుసార్లు అమెరికా దాడి.. శిథిలాల్లో కొన ఊపిరితో గుర్తింపు!

Mojtaba Khamenei: మొజ్తబాపై రెండుసార్లు అమెరికా దాడి.. శిథిలాల్లో కొన ఊపిరితో గుర్తింపు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 27, 2026
03:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధం ప్రారంభమైన సమయంలోనే మాజీ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. ఆ దాడిలో ఆయన కుమారుడు, కొత్త సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) కూడా మృతిచెందినట్లు తొలుత వార్తలొచ్చాయి. అయితే దాడుల నుంచి ఆయన త్రుటిలో బయటపడినట్లు ఇరాన్‌ వెల్లడించింది. ఫిబ్రవరిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇరాన్‌ అసెంబ్లీ ఆఫ్‌ ఎక్స్‌పర్ట్స్‌ సభ్యుడు మొహ్సెన్‌ హెయ్‌దరీ తాజాగా కీలక విషయాలను వెల్లడించారు. తమ అగ్రనేత మొజ్తబాపై దాడి ఒకసారి మాత్రమే జరగలేదని.. అమెరికా రెండు సార్లు ఆయనను లక్ష్యంగా చేసుకుందని తెలిపారు.

వివరాలు

సమావేశం జరుగుతుండగా తొలి దాడి

'అలీ ఖమేనీ సహా కీలక నేతలు ఓ భవనంలో సమావేశమైన సమయంలో అమెరికా దాడులు చేసింది. ఈ ఘటనలో మాజీ సుప్రీం నేత ప్రాణాలు కోల్పోయారు.

తీవ్రంగా గాయపడిన మొజ్తబాను వెంటనే వైద్యం కోసం ఓ ఆస్పత్రికి తరలించాం. అయితే అనంతరం అమెరికా-ఇజ్రాయెల్‌ దళాలు ఆ ఆస్పత్రిపై కూడా దాడి చేశాయి.

దీంతో ఆస్పత్రి పూర్తిగా ధ్వంసమైంది. కొన్ని గంటల పాటు శ్రమించిన మా బలగాలు శిథిలాల నుంచి మొజ్తబాను బయటకు తీశాయి.

కొన ఊపిరితో ఉన్న ఆయనను మరో సురక్షిత ప్రాంతానికి తరలించి చికిత్స అందించాం' అని మొహ్సెన్‌ హెయ్‌దరీ తెలిపారు.

వివరాలు

సుప్రీం లీడర్‌గా ఎంపికైన విషయం కూడా తెలియదు

మొజ్తబా ఖమేనీని ఇరాన్‌ తదుపరి సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్న విషయం కూడా బహిరంగంగా ప్రకటించే వరకు ఆయనకు తెలియదని మొహ్సెన్‌ హెయ్‌దరీ వెల్లడించారు.

అనంతరం సుప్రీం లీడర్‌గా తన ఎంపికను మొజ్తబా అంగీకరించక తప్పలేదని చెప్పారు.

ADVERTISEMENT

వివరాలు

కమిటీ సభ్యులపైనా దాడులు

ఇరాన్‌కు కొత్త నాయకుడిని ఎన్నుకోవడానికి నియమించిన కమిటీ నేతలను కూడా అమెరికా, ఇజ్రాయెల్‌ లక్ష్యంగా చేసుకున్నాయని హెయ్‌దరీ తెలిపారు.

వారు తరచూ సమావేశమయ్యే ఖోమ్ సెక్రటేరియట్‌పై దాడులు జరిగాయని చెప్పారు. ఈ ఘటనలో కమిటీకి చెందిన 8 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు.

మొజ్తబా ఖమేనీని సుప్రీం లీడర్‌గా ఎన్నుకోవడానికి రూపొందించిన నివేదికలు, సిఫార్సులు కూడా ఈ దాడుల్లో కాలిబూడిదయ్యాయని తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు

ట్రంప్‌ హెచ్చరించినా.. మొజ్తబానే నాయకుడిగా ఎంపిక

మొజ్తబా ఖమేనీని సుప్రీం లీడర్‌గా ఎన్నుకోవద్దని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించినట్లు మొహ్సెన్‌ హెయ్‌దరీ తెలిపారు.

అయినప్పటికీ మొజ్తబానే దేశాన్ని ముందుకు నడిపించగలరని భావించి ఆయనను తమ నాయకుడిగా ఎన్నుకున్నామని చెప్పారు.

ఈ వివరాలను మొహ్సెన్‌ హెయ్‌దరీ ఖతార్‌ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ADVERTISEMENT