LNG Train: దేశంలోనే తొలి ఎల్‌ఎన్‌జీ రైలు.. పచ్చజెండా ఊపి ప్రారంభించిన అమిత్ షా
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రైల్వే వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ సమూలంగా మార్చారని కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) పేర్కొన్నారు. గుజరాత్‌లోని సబర్మతి రైల్వేస్టేషన్‌లో దేశంలోనే మొట్టమొదటి ఎల్‌ఎన్‌జీ రైలును (LNG Train) ఆయన పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో అమిత్ షా ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ (Congress)పై అమిత్ షా విమర్శలు చేశారు. కాంగ్రెస్ తన పాలనలో కుంభకోణాలు చేయడం తప్ప మరేమీ చేయలేదని ఆరోపించారు. మరోవైపు గత 12 ఏళ్లలో ప్రధాని మోదీపై ఎవరూ అవినీతి ఆరోపణలు చేయలేకపోయారని అన్నారు. అర్థరహితంగా మాట్లాడే హస్తం పార్టీని వాస్తవాలు, గణాంకాల ఆధారంగా చర్చకు రావాలని సవాలు చేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
వివరాలు
రైల్వేల్లో ఆధునిక సదుపాయాలు
2014లో మోదీ (Narendra Modi) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైల్వే వ్యవస్థలో అనేక కొత్త సదుపాయాలను కల్పించి, దానిని ఆధునికీకరించారు.
ప్రత్యేక సరకు రవాణా కారిడార్, రాపిడ్ రైల్ సిస్టమ్, అత్యాధునిక రైల్వే స్టేషన్లకు శ్రీకారం చుట్టారు.
హైడ్రోజన్‌తో నడిచే రైలును ప్రారంభించడం ద్వారా ప్రపంచంలో ఆ సాంకేతికత కలిగిన నాలుగు దేశాల సరసన భారత్‌ను నిలిపారు.
ముంబయి నుంచి వడోదర వరకు మొట్టమొదటి లాంగ్ డబుల్ స్టాక్ కంటైనర్ రైలు ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది.
11 వేల కిలోమీటర్ల రైలు కారిడార్‌ను నాలుగు ట్రాక్‌ల నెట్‌వర్క్‌గా మార్చుతున్నాం'' అని అమిత్ షా తెలిపారు.
వివరాలు
డీజిల్ వినియోగం భారీగా తగ్గింది
రైల్వేల్లో డీజిల్ వినియోగం కూడా గణనీయంగా తగ్గిందని అమిత్ షా వెల్లడించారు. ''2015-16లో రైల్వేలు 293 కోట్ల లీటర్ల డీజిల్‌ను వినియోగించాయి.
2024-25 నాటికి ఆ వినియోగం 108 కోట్ల లీటర్లకు తగ్గింది. 2030 నాటికి డీజిల్ వినియోగాన్ని సున్నాకు తగ్గిస్తాం. దీనివల్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది.
2010-11లో ఏటా కేవలం 75 కిలోమీటర్ల మేర రైల్వే మార్గాల విద్యుదీకరణ జరిగేది. 2023-24 నాటికి ఆ సంఖ్య 7,188 కిలోమీటర్లకు పెరిగింది.
ప్రస్తుతం 99.6 శాతం రైల్వే నెట్‌వర్క్ విద్యుదీకరణ పూర్తయ్యిందని అమిత్ షా పేర్కొన్నారు.
వివరాలు
డీజిల్, ఎల్‌ఎన్‌జీతో కొత్త రైలు
కాగా.. సబర్మతి రైల్వేస్టేషన్‌లో ప్రారంభించిన కొత్త రైలు ఎల్‌ఎన్‌జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్), డీజిల్ రెండింటిపైనా నడుస్తుంది.
ఈ రైలు డీజిల్ వినియోగంలో సుమారు 40 శాతాన్ని ఎల్‌ఎన్‌జీతో భర్తీ చేస్తుంది.
డీజిల్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు ఇంధన ఖర్చులు, ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ ఎల్‌ఎన్‌జీ రైలును ప్రవేశపెట్టారు.