Page Loader
Satyabhama teaser: కాజల్ నటించిన 'సత్యభామ' టీజర్ విడుదల తేదీని ప్రకటించిన నిర్మాతలు

Satyabhama teaser: కాజల్ నటించిన 'సత్యభామ' టీజర్ విడుదల తేదీని ప్రకటించిన నిర్మాతలు

వ్రాసిన వారు Stalin
Nov 08, 2023
05:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల భగవంత్ కేసరిలో నందమూరి బాలకృష్ణతో కలిసి నటించిన కాజల్ అగర్వాల్.. త్వరలో క్రైమ్ థ్రిల్లర్‌ 'సత్యభామ' సినిమాతో ప్రేక్షకులను అలరించబోతోంది. 'సత్యబామ' కాజల్ అగర్వాల్‌కు 60వ చిత్రం కావడం గమనార్హం. ఈ మూవీలో కాజల్ ఏసీపీ పాత్రను పోషించింది. తాజాగా 'సత్యబామ' సినిమా టీజర్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. సత్యభామ టీజర్‌ను దీపావళి కానుకగా నవంబర్ 10న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే, టీజర్‌ను ఏ సమయానికి విడుదల చేస్తారనే విషయాన్ని మాత్రం నిర్మాతలు చెప్పలేదు. అఖిల్ డేగల దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఔరం ఆర్ట్స్ బ్యానర్‌పై బాబీ తిక్క, శ్రీనివాస్ రావు తక్కలపెల్లి నిర్మించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సత్యభామ టీజర్ విడుదలపై ట్వీట్