Loading...
AA24 Secret Out: AA24పై సీక్రెట్ లీక్‌.. అల్లు అర్జున్‌ దగ్గర కనిపించిన స్టార్‌ రైటర్‌!
AA24పై సీక్రెట్ లీక్‌.. అల్లు అర్జున్‌ దగ్గర కనిపించిన స్టార్‌ రైటర్‌!

AA24 Secret Out: AA24పై సీక్రెట్ లీక్‌.. అల్లు అర్జున్‌ దగ్గర కనిపించిన స్టార్‌ రైటర్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 13, 2026
05:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాన్‌ ఇండియా బాక్సాఫీస్‌ వద్ద తనకంటూ తిరుగులేని సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అడుగులు ఇప్పుడు మరింత దూకుడుగా మారాయి. వరుస భారీ ప్రాజెక్టులతో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న బన్నీ.. తన మైల్‌స్టోన్‌ ఫిల్మ్‌ '#AA24' కోసం ఎలాంటి జోనర్‌ను ఎంచుకోబోతున్నారు? ఈ సినిమాకు దర్శకుడు ఎవరు? అనే ప్రశ్నలు గత కొంతకాలంగా టాలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే తాజాగా నెట్టింట ప్రత్యక్షమైన ఓ ఫొటో సినీ ప్రియుల అనుమానాలను దాదాపు నిజం చేస్తూ సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. మలయాళ చిత్రసీమలో సూపర్‌ హీరో సబ్జెక్ట్‌తో ఇండియన్‌ సినిమా దృష్టిని తనవైపు తిప్పుకున్న డైరక్టర్ బాసిల్‌ జోసెఫ్‌.

వివరాలు

ఇండస్ట్రీలో హాట్ టాపిక్

స్టార్‌ కో-రైటర్‌ అరుణ్‌ అనిరుధన్‌ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ స్టోరీ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

అల్లు అర్జున్‌కు అత్యంత ఇష్టమైన లగ్జరీ కారు రేంజ్‌ రోవర్‌ 'బీస్ట్‌' వద్ద దిగిన ఫొటోను అరుణ్‌ అనిరుధన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పంచుకున్నారు.

బన్నీ సొంత వాహనం దగ్గర, ఆయన వ్యక్తిగత ప్రాంగణంలో 'మిన్నల్‌ మురళి' రైటర్‌ కనిపించడంతో నెటిజన్లు ఒక్కసారిగా డాట్స్‌ కనెక్ట్‌ చేయడం మొదలుపెట్టారు.

అల్లు అర్జున్‌-బాసిల్‌ జోసెఫ్‌ కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్‌ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ రూపుదిద్దుకోనుందంటూ ఫిలింనగర్‌ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు బాసిల్‌ రైటింగ్‌ టీమ్‌ నేరుగా బన్నీ అడ్డాలోకి ఎంట్రీ ఇవ్వడంతో.. కథా చర్చలు కేవలం మాటలకే పరిమితం కాలేదన్నారు.

వివరాలు

సరికొత్త కంటెంట్ ను సిద్ధం చేసినట్లు సమాచారం

తుది దశకు చేరుకున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఐకాన్‌ స్టార్‌ ఇమేజ్‌కు తగ్గట్టుగా బాసిల్‌ బృందం ఓ సరికొత్త కంటెంట్‌తో స్టోరీని సిద్ధం చేసిందని, గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

అరుణ్‌ అనిరుధన్‌ లాంటి టాలెంటెడ్‌ రైటర్‌ పవర్‌ఫుల్‌ స్క్రిప్ట్‌, బాసిల్‌ జోసెఫ్‌ సరికొత్త నేరేషన్‌, వీటన్నింటికీ తోడు అల్లు అర్జున్‌ మాస్‌ అండ్‌ స్టైలిష్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ కలిస్తే థియేటర్లలో విధ్వంసం ఏ రేంజ్‌లో ఉంటుందోనని ఫ్యాన్స్‌ చర్చించుకుంటున్నారు.

కేవలం ఒకే ఒక్క ఇన్‌స్టా పిక్‌తో '#AA24' హైప్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. అధికారిక ప్రకటన వెలువడితే.. ఇండియన్‌ సినీ చరిత్రలోనే మరో బిగ్గెస్ట్‌ అనౌన్స్‌మెంట్‌గా నిలవడం ఖాయమని చెప్పొచ్చు.

ADVERTISEMENT