LOADING...
Wedding Of Virosh: 18.5 మిలియన్ లైక్స్‌తో సంచలనం.. విజయ్-రష్మిక పెళ్లి ఫోటో రికార్డ్!
18.5 మిలియన్ లైక్స్‌తో సంచలనం.. విజయ్-రష్మిక పెళ్లి ఫోటో రికార్డ్!

Wedding Of Virosh: 18.5 మిలియన్ లైక్స్‌తో సంచలనం.. విజయ్-రష్మిక పెళ్లి ఫోటో రికార్డ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 27, 2026
04:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ, రష్మిక మంధన్న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న 'మెమెంటోస్ ప్యాలెస్'లో అతికొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. 'విరోష్' పేరుతో అభిమానుల్లో ప్రసిద్ధి చెందిన ఈ జంట, తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అభిమానులు ప్రేమతో పాటు శుభాకాంక్షలు కురిపించడంతో ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. మిలియన్ల కొద్దీ లైక్స్ సాధించి సంచలనం సృష్టించాయి. పాన్ ఇండియా స్థాయిలో వీరి పెళ్లి ఫోటోలకు అత్యధిక లైక్స్ వచ్చినట్లు అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఇప్పటివరకు సినీ పరిశ్రమలో పెళ్లి ఫోటోల విషయంలో రికార్డు బాలీవుడ్ నటి 'కియారా అద్వాని'దే. ఆమె పెళ్లి ఫోటోలకు 15.8 మిలియన్ లైక్స్ వచ్చాయి.

Details

18.5 మిలియన్ లైక్స్ సొంతం

అయితే తాజా పరిస్థితుల్లో విరోష్ జంట 18.5 మిలియన్ లైక్స్ సాధించి కొత్త రికార్డు నెలకొల్పింది. విజయ్ దేవరకొండ తన అకౌంట్‌లో షేర్ చేసిన అదే ఫోటోలకు కూడా 15.2 మిలియన్ లైక్స్ రావడం విశేషం. ఈ నేపథ్యంలో విజయ్-రష్మిక జంట మరోసారి తమ క్రేజ్‌ను చిత్రపరిశ్రమకు చాటిందని అభిమానులు అంటున్నారు. ఇదిలా ఉండగా, ఈ జంట కలిసి రణబాలి సినిమాలో నటిస్తున్నారు. టీ సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'రాహుల్ సాంకృత్యాన్' దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఇదే ఏడాది సెప్టెంబర్ 11న విడుదల కానుంది.

Advertisement