Loading...
Star Daughters Debut : కూతుళ్లను స్టార్ హీరోయిన్లుగా తీర్చిదిద్దే పనిలో షారూఖ్, మోహన్‌లాల్!
కూతుళ్లను స్టార్ హీరోయిన్లుగా తీర్చిదిద్దే పనిలో షారూఖ్, మోహన్‌లాల్!

Star Daughters Debut : కూతుళ్లను స్టార్ హీరోయిన్లుగా తీర్చిదిద్దే పనిలో షారూఖ్, మోహన్‌లాల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 16, 2026
02:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్‌లో అడుగుపెట్టి, నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించిన స్టార్ హీరోగా ఎదిగిన షారూఖ్ ఖాన్.. ఇప్పుడు తన నట వారసులను సినీ పరిశ్రమలో నిలబెట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇప్పటికే కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను దర్శకుడిగా పరిచయం చేసిన ఆయన.. ఇప్పుడు కుమార్తె సుహానా ఖాన్‌ను వెండితెరకు తీసుకొచ్చే పనిలో నిమగ్నమయ్యారు. ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' సిరీస్ కోసం షారూఖ్ తన సొంత సినిమా పనులను కూడా పక్కనబెట్టి సహకరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, తన ప్రభావాన్ని ఉపయోగించి బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నటులను కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం చేశారు.

వివరాలు

'ది ఆర్చీస్' చిత్రంతో పరిచయం

ఇక కుమార్తె సుహానా ఖాన్ ఇప్పటికే 'ది ఆర్చీస్' చిత్రంతో ఓటీటీ ప్రేక్షకులకు పరిచయమైంది.

ఇప్పుడు ఆమె తన తండ్రి షారూఖ్ ఖాన్‌తో కలిసి 'కింగ్' సినిమాలో తొలిసారి వెండితెరపై కనిపించనుంది.

ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న షారూఖ్.. ఈ ఏడాది చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు.

మరోవైపు మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కూడా తన కుమార్తె విస్మయను హీరోయిన్‌గా పరిచయం చేసేందుకు సిద్ధమయ్యారు.

ఇప్పటికే తన కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ హీరోగా గుర్తింపు తెచ్చుకోగా.. ఇప్పుడు విస్మయ సినీ ప్రయాణం విజయవంతం కావాలని ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

వివరాలు

కుటుంబం నుంచి పూర్తి మద్దతు

విస్మయ నటిస్తున్న 'తుడక్కమ్' చిత్రం ప్రకటన వచ్చినప్పటి నుంచే కుటుంబం పూర్తి మద్దతు అందిస్తోంది. ఈ సినిమాలో మోహన్‌లాల్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

'2018' ఫేమ్ జూడ్ ఆంటోనీ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇలా తమ కూతుళ్ల సినీ కెరీర్‌కు బలమైన ఆరంభం ఇవ్వాలనే ఉద్దేశంతో షారూఖ్ ఖాన్, మోహన్‌లాల్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో త్వరలోనే తేలనుంది.

ADVERTISEMENT