LOADING...
Aryan Khan : ఖరీదైన ఇల్లు, కార్లు, వాచ్‌లతో షారుక్ ఖాన్ కొడుకు లగ్జరీ జీవితం... ఆర్యన్ ఖాన్ సంపాదన ఎంతంటే?
ఖరీదైన ఇల్లు, కార్లు, వాచ్‌లతో షారుక్ ఖాన్ కొడుకు లగ్జరీ జీవితం... ఆర్యన్ ఖాన్ సంపాదన ఎంతంటే?

Aryan Khan : ఖరీదైన ఇల్లు, కార్లు, వాచ్‌లతో షారుక్ ఖాన్ కొడుకు లగ్జరీ జీవితం... ఆర్యన్ ఖాన్ సంపాదన ఎంతంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 12, 2025
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఇటీవల డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. గతంలో డ్రగ్స్ వివాదంతో పెద్దగా మీడియా చర్చకు గురైన ఆర్యన్, ఇప్పుడు రెగ్యులర్‌గా వార్తల్లో కనిపిస్తున్నారు. షారుఖ్ కుమారుడిగా కాకుండా, ఆర్యన్ డైరెక్షన్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవలే అతను 'ది బ్యాడ్స్ అఫ్ బాలీవుడ్' అనే వెబ్ సిరీస్‌తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే, సిరీస్ సూపర్ హిట్‌ కాలేదు. అయితే, ఆర్యన్ ఖాన్ తండ్రి షారుఖ్ ఖాన్ లాగే తన నెట్‌వర్త్ పెంచుకోవడంలో విజయవంతంగా కొనసాగుతున్నాడు.

Details

వ్యాపారాల్లో పెట్టుబడులు

షారుఖ్ ఖాన్ ప్రపంచవ్యాప్తంగా 12,490 కోట్లు విలువైన ఆస్తులతో టాప్ స్టార్ గా ఉంటే, ఆర్యన్ ఖాన్ ఇప్పుడు సుమారు 80 కోట్ల రూపాయల నెట్‌వర్త్ కలిగినట్టు ఇటీవలే ఒక నివేదిక వెల్లడించింది. ఆర్యన్ అమెరికా, ఇంగ్లాండ్‌లో ఫిల్మ్ మేకింగ్, ప్రొడక్షన్ కోర్సులు పూర్తిచేశాడు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి, అనుభవాన్ని మరింత పెంచుకున్నాడు. ఇప్పుడు 'D యావోల్' అనే ఖరీదైన క్లాతింగ్ బిజినెస్‌ను స్థాపించడమే కాకుండా, మరికొన్ని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాడు.

Details

భవిష్యత్తులో వేల కోట్లు సంపాదించే అవకాశం

ఆర్యన్ వద్ద 7.83 లక్షల విలువ చేసే లగ్జరీ వాచ్ ఉంది. ఇటీవల 37 కోట్లు విలువ చేసే ఇళ్లను దిల్లీలో కొన్నాడు. అతని వాహనాల జాబితాలో ఆడి ఏ6, మెర్సిడెస్ బెంజ్, BMW లాంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇది అన్ని ఆర్యన్ స్వంత సంపాదన ద్వారా సంపాదించుకున్నారు. ప్రస్తుతం 27 ఏళ్ళ వయసులోనే, ఆర్యన్ తన కెరీర్ ప్రారంభ దశలోనే ఈ స్థాయి సంపాదన సాధించాడు. భవిష్యత్తులో తండ్రి షారుఖ్ ఖాన్ లాగా వేల కోట్ల ఆస్తులు సంపాదించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.