
Sharuk Khan: షారుక్ ఖాన్‌కు అత్యవసర చికిత్స.. అమెరికాకు ప్రయాణం
ఈ వార్తాకథనం ఏంటి
కొన్ని నెలలుగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.
మే21న ఆయనకు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు అహ్మదాబాద్‌లోని కేడీ ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే.
తొలుత వడదెబ్బ అని ప్రచారం జరగ్గా, తర్వాత మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విషయం ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
తాజాగా షారుక్ ఖాన్ అత్యవసర చికిత్స కోసం మరోసారి అమెరికాకు వెళ్లాల్సి వచ్చింది. ఈ సారి కంటి సమస్య కారణంగా వెళ్లినట్లు తెలిసింది.
Details
షారుక్ ఖాన్ అభిమానుల్లో ఆందోళన
2014లో ఆయన కంటి ఆపరేషన్ చేసుకున్నాడు. మళ్లీ ఆ సమస్య తిరగబెట్టడంతో ఆయన్ను ముంబైలోని ఓ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ సమస్య పెద్దది కావడంతో వెంటనే యూఎస్ వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు కంటి సమస్య గురించి బయటికి రావడంతో ఆయన అభిమానులు కంగారు పడుతున్నారు. షారుక్ ఖాన్ తర్వగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.