Page Loader
Shahrukh Khan : శ్రీవారి సేవలో షారూక్, కూతురు సుహానా, హీరోయిన్ నయనతార
శ్రీవారి సేవలో షారూక్, కూతురు సుహానా, హీరోయిన్ నయనతార

Shahrukh Khan : శ్రీవారి సేవలో షారూక్, కూతురు సుహానా, హీరోయిన్ నయనతార

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 05, 2023
04:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, భార్య గౌరీ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, ప్రముఖ నటి నయనతారతో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండలంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేసి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. టీటీడీ అధికారులు షారుక్ కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. గురువారం షారుక్, నయనాతార నటించిన జావాన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక షారుక్ ను చూసేందుకు భక్తులు పోటీపడ్డారు. ఇక తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమా తెరకెక్కగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Details

మొదటిసారి తిరమలకు విచ్చేసిన షారుక్ ఖాన్

జావాన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చైన్నైను నేడు ఉదయం విచ్చేసిన షారుక్ ఖాన్, నయనతారా మరికొంతమంది చిత్రయూనిట్ తో కలిసి తిరుమలకు వచ్చి అనంతరం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. షారుక్ ఖాన్ తన లైఫ్ లో తిరుమలకు రావడం ఇదే మొదటిసారి. నయనతార భర్త, దర్శకుడు విగ్నేష్ శివన్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. మొదటిసారిగా షారుఖ్ ఖాన్ తిరుమలకు రావడంతో ఆలయంలోకి నడిచి వెళ్తున్న భక్తులు సెల్ఫీ కోసం ఎగబడ్డారు.