
బాలీవుడ్: షారుక్ ఖాన్ బ్లూ వాచ్ ఖరీదుతో రెండు చిన్న సినిమాల నిర్మాణం
ఈ వార్తాకథనం ఏంటి
పఠాన్ యాక్టర్ షారుక్ ఖాన్, పఠాన్ సినిమా విజయంతో సంతోషంగా ఉన్నారు. చాలారోజుల తర్వాత అటు బాలీవుడ్ లోనూ, ఇటు షారుక్ ఖాన్ కెరీర్లోనూ మంచి విజయం వచ్చింది.
దీపికా పదుకునే హీరోయిన్ గా నటించిన పఠాన్ మూవీ, 900కోట్ల గ్రాస్ దిశగా పరుగులు పెడుతోంది. బాయ్ కాట్ బాలీవుడ్ ని కూడా పక్కకు నెట్టి పఠాన్ మూవీ దూసుకుపోయింది.
ఐతే ప్రస్తుతం పఠాన్ మూవీయే కాదు పఠాన్ యాక్టర్ షారుక్ ఖాన్ ధరించిన బ్లూ వాచ్ కూడా వార్తల్లొ నిలిచింది. తాజాగా ఒక ఈవెంట్ లో దర్శనమిచ్చిన షారుక్, చేతికి బ్లూ వాచ్ తో కనిపించాడు.
ఆ బ్లూ వాచ్ ధర తెలిస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే.
షారుక్ ఖాన్
4.98కోట్ల ధరతో బ్లూ వాచ్
పఠాన్ మూవీ ఈవెంట్ లో బ్లూ వాచ్ తో కనిపించిన షారుక్, రెండోసారి దీపికా పదుకునే పోస్ట్ చేసిన ఒక చిన్న వీడియోలోనూ బ్లూ వాచ్ తో దర్శనమిచ్చాడు.
తమ స్కిన్ కేర్ రొటీన్ గురించి అభిమానులకు తెలియజేసే ఆ వీడియోలో అందరినీ ఆకర్షించింది బ్లూ వాచ్ అనే చెప్పాలి. Audemars Piguet కంపెనీకి చెందిన ఈ వాచ్, 4.98కోట్ల ఖరీదు ఉంటుందని సమాచారం.
క్రోనో24 వెబ్ సైట్ ప్రకారం 4.7కోట్ల ఖరీదు చేస్తుందని తెలుస్తుంది. ఆ ఖరీదుతో రెండు చిన్న సినిమాలు రెడీ అవుతాయని అభిమానులు అనుకుంటున్నారు. గతంలోనూ షారుక్ ఖాన్ ధరించిన వాచెస్ టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలిచాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
షారుక్ ఖాన్ బ్లూ వాచ్ ఖరీదు కోట్లలో
#SRK doing a skincare routine is the most adorable thing you'll see today🥹❤️
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) February 9, 2023
Book your tickets now to watch him in an action packed avatar in #Pathaan:https://t.co/z4YLOG2NRI | https://t.co/lcsLnUSu9Y@iamsrk @deepikapadukone#ShahRukhKhan #DeepikaPadukone #JohnAbraham #YRF50 pic.twitter.com/3LCDxY57UJ