Loading...
Bhogi: శర్వానంద్ 'భోగి'కి బ్రేక్.. రిలీజ్ వాయిదా.. అసలు కారణం ఇదే!
శర్వానంద్ 'భోగి'కి బ్రేక్.. రిలీజ్ వాయిదా.. అసలు కారణం ఇదే!

Bhogi: శర్వానంద్ 'భోగి'కి బ్రేక్.. రిలీజ్ వాయిదా.. అసలు కారణం ఇదే!

వ్రాసిన వారు Moogati Shabari
Aug 20, 2026
05:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా మాస్ డైరెక్టర్ సంపత్ నంది తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామా 'భోగి'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆగస్టు 28న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న 'భోగి'పై ఇప్పటికే ప్రేక్షకుల్లో, ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

వివరాలు

అందుకే మూవీ వాయిదా?

1960ల నాటి ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో ఈ కథ సాగనున్నట్లు సమాచారం.

సినిమాలో శర్వానంద్ 'గంగా' అనే ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు.

ఆయనకు జోడీగా అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇక ఈ సినిమా క్లైమాక్స్ కోసం చిత్రబృందం ఏకంగా 30 రోజుల పాటు భారీ యాక్షన్ షెడ్యూల్‌ను పూర్తి చేసిన విషయం తెలిసిందే.

అయితే ప్రస్తుతం సినిమాకు సంబంధించిన వీఎఫ్‌ఎక్స్ పనులు అనుకున్నదానికంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి.

పీరియడ్ వరల్డ్, యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్స్‌ను మరింత అద్భుతంగా చూపించేందుకు ఎలాంటి రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే రిలీజ్ డేట్‌ను వాయిదా వేసినట్లు మేకర్స్ తెలిపారు.

వివరాలు

త్వరలో అధికారికంగా కొత్త రిలీజ్ డేట్ ప్రకటన..

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 'భోగి'ని విడుదల చేయనున్నారు.

వీఎఫ్‌ఎక్స్ పనులు పూర్తయిన తర్వాత కొత్త రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటిస్తామని చిత్రబృందం వెల్లడించింది.

ADVERTISEMENT