శర్వానంద్ పెళ్ళికి ముహూర్తం ఫిక్స్: వేడుక ఎక్కడ జరుగుతుందంటే?
తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ లిస్టులో ఒకరిగా మిగిలిన శర్వానంద్, సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ రక్షితా రెడ్డితో ఎంగేజ్మెంట్ జరుపుకుని పెళ్ళికి సిద్ధమైపోయాడు. తాజాగా శర్వానంద్ పెళ్ళి డేట్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది. జూన్ 2, 3తేదీల్లో శర్వానంద్ పెళ్ళి వేడుక జరగనుందట. రాజస్థాన్ లోని లీలా ప్యాలస్ లో అతిరథ మహారథుల సమక్షంలో ఘనంగా జరగనుందని వినిపిస్తోంది. శర్వానంద్ నిశ్చితార్థానికి హాజరైన మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, అమల అక్కినేని, హీరో నితిన్, రానా దగ్గుబాటి.. మొదలగు వారందరూ రాజస్థాన్ లో పెళ్ళి వేడుకకు హాజరవుతారని తెలుస్తోంది. రామ్ చరణ్ దంపతులు కూడా శర్వా పెళ్ళిలో సందడి చేయనున్నారని సమాచారం.
సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ తో శర్వానంద్ వివాహం
మొన్నటివరకు శర్వానంద్, రక్షితా శెట్టిల ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యిందని పుకార్లు వచ్చాయి. కానీ ఇప్పుడు పెళ్ళి డేట్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై అధికారికంగా ఎప్పుడు ప్రకటన వెలువడుతుందో చూడాలి. శర్వానంద్ కాబోయే భార్య రక్షిత, హైకోర్టు అడ్వకేట్ మధుసూదన్ రెడ్డి కూతురు. తెలుగుదేశం పార్టీ నాయకుడు బొజ్జల గోపాల కృష్ణారెడ్డికి మనవరాలు అవుతుంది. అమెరికాలో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తోంది రక్షిత. అదలా ఉంచితే, శర్వానంద్ ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ పెట్టలేదు. పెళ్ళి సమయానికి షుటింగ్ షెడ్యూల్ పూర్తిచేయాలని శర్వానంద్ అనుకుంటున్నాడని అంటున్నారు.