Loading...
Bhogi Movie Review: శర్వానంద్ 'భోగి' మూవీ రివ్యూ.. మాస్ అవతారంలో మెప్పించాడా?
శర్వానంద్ 'భోగి' మూవీ రివ్యూ.. మాస్ అవతారంలో మెప్పించాడా?

Bhogi Movie Review: శర్వానంద్ 'భోగి' మూవీ రివ్యూ.. మాస్ అవతారంలో మెప్పించాడా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2026
01:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది ఆరంభంలోనే 'నారీ నారీ నడుమ మురారి' సినిమాతో హిట్ కొట్టిన శర్వానంద్.. ఇప్పుడు 'భోగి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించగా, డింపుల్ హయాతి మరో కీలక పాత్రలో కనిపించింది. ఒకసారి వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? శర్వానంద్ నటన ఎలా ఉంది? సినిమాలోని బలాలు, బలహీనతలు ఏమిటో మూవీ రివ్యూలో చూద్దాం.

వివరాలు

కథేంటంటే?

1960ల కాలంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న బొగ్గుల గుట్ట అనే పల్లెటూరిలో గంగ (శర్వానంద్) తన ఐదుగురు చెల్లెళ్లతో కలిసి జీవిస్తుంటాడు.

జీవనోపాధి కోసం ఒకవైపు కుమ్మరి పని చేస్తూ, మరోవైపు వ్యవసాయం చేస్తుంటాడు. చిన్నప్పటి నుంచి తన ఇంటి పక్కనే ఉండే సులోచన (అనుపమ పరమేశ్వరన్) అంటే గంగకు ఎంతో ఇష్టం.

ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు తన అన్న జంపన్నకు బదులుగా ఊరి పటేల్ చెప్పిన పని చేసేందుకు గంగ దగ్గర్లోని ఓ గూడానికి వెళ్తాడు.

అక్కడ కొంతమంది ఆడపిల్లలను అపహరించి తీసుకెళ్లి బలి ఇస్తున్నారని తెలుసుకుంటాడు. వెంటనే వారందరినీ ఆ బలి నుంచి కాపాడతాడు.

వివరాలు

విశ్లేషణ

మరి ఈ విషయం తెలుసుకున్న గంగ ఏం చేశాడు? అసలు ఆడపిల్లలను ఎందుకు బలి ఇస్తున్నారు? దీని వెనుక ఉన్న కారణమేంటి? చివరికి గంగ ఏం చేశాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఇటీవల ఒకట్రెండు రా అండ్ రస్టిక్ సినిమాలు విజయవంతం కావడంతో టాలీవుడ్‌లోనూ అలాంటి కథలపై ఆసక్తి పెరిగినట్లు కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి ఫ్యామిలీ, లవర్‌బాయ్ ఇమేజ్ ఉన్న శర్వానంద్‌తో ఇలాంటి రా అండ్ రస్టిక్ సినిమా చేయడం విశేషం.

మాస్ సినిమాలు తెరకెక్కించడంలో మంచి పేరున్న సంపత్ నంది.. పూర్తిస్థాయి రా అండ్ రస్టిక్ కథను సిద్ధం చేసి శర్వానంద్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచే ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT

వివరాలు

15 ఎకరాల్లో ప్రత్యేకమైన సెట్

అయితే సినిమా మొదలైన కొద్దిసేపటికే ఇది సాధారణ కథ కాదని అర్థమవుతుంది. 1960ల కాలాన్ని నేపథ్యంగా ఎంచుకోవడంతో సహజమైన లొకేషన్లలో చిత్రీకరణకు అవకాశం లేకుండా పోయింది.

అందుకే సినిమా కోసం ఏకంగా 15 ఎకరాల్లో ప్రత్యేకమైన సెట్ నిర్మించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ తెరపై కొన్ని సన్నివేశాల్లో సహజత్వం కొరవడిన భావన కలుగుతుంది.

ఆడపిల్లలు అనూహ్యంగా మాయమవ్వడం, ఆ తర్వాత హీరో పరిచయం, చెల్లెళ్లతో అతడి అనుబంధం వంటి అంశాలను చూపిస్తూనే దర్శకుడు పెద్దగా ఆలస్యం చేయకుండా కథలోకి తీసుకెళ్లాడు.

ఇంటర్వెల్ సమయానికి హీరో చెల్లెళ్లు చనిపోవడం, విలన్ గ్యాంగ్ అతడిని చావు దెబ్బలు కొట్టడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది.

ADVERTISEMENT

వివరాలు

నరబలి నేపథ్యంలో కథ

ఆ తర్వాత హీరో తన పగను ఎలా తీర్చుకున్నాడు? నరబలి ఆచారాన్ని ఎలా అడ్డుకున్నాడు? గ్రామస్థులకు ఎలా అండగా నిలిచాడు? అనే అంశాలతో కథ ముందుకు సాగుతుంది. వినడానికి ఆసక్తికరంగా ఉన్న ఈ కథను తెరపై ఆవిష్కరించడం మాత్రం అంత సులభం కాలేదు.

ఆ విషయం సినిమా చూస్తున్నప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. ఫస్టాఫ్ ప్రేక్షకులను కొంతవరకు ఎంగేజ్ చేసినా.. సెకండాఫ్ మాత్రం అదే స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ద్వితీయార్ధంలో కథనం తడబడినట్లు అనిపిస్తుంది.

నరబలి నేపథ్యంలో తెలుగులో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఈ చిత్రంలో ఆ అంశం చుట్టూ హీరో చేసే పోరాటాన్ని ఎక్కువ రక్తపాతంతో చూపించారు.

ఈ విషయంలో కొంత నియంత్రణ పాటించి ఉంటే బాగుండేది.

వివరాలు

నటీనటుల పనితీరు

నటీనటుల విషయానికి వస్తే.. ఈ సినిమాలో శర్వానంద్‌ది వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. పూర్తిగా రగ్డ్ లుక్‌లో కనిపిస్తూ తన పాత్రకు న్యాయం చేశాడు.

ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో అతడి నటనలో పరిణతి కనిపిస్తుంది. అయితే ఈ పాత్రతో శర్వానంద్‌కు మాస్ మేకోవర్ వచ్చినప్పటికీ.. సినిమా ఫలితం మాత్రం ఆ స్థాయిలో ఉండకపోవచ్చనే భావన కలుగుతుంది.

అనుపమ పరమేశ్వరన్ పాత్ర పరిధి తక్కువే అయినా తన నటనతో ఆకట్టుకుంది. ప్రమోషన్లలో ఎక్కువగా కనిపించిన డింపుల్ హయాతి పాత్ర మాత్రం సినిమాలో చాలా పరిమితంగా ఉంది.

మిగతా నటీనటులంతా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ముఖ్యంగా పటేల్ పాత్రను మరింత బలంగా చూపించే అవకాశం ఉన్నప్పటికీ.. దాన్ని పరిమితం చేసినట్లు అనిపిస్తుంది.

వివరాలు

సాంకేతిక వర్గం

బహుశా ఎడిటింగ్‌లో కొన్ని సన్నివేశాలు తొలగించి ఉండొచ్చు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ట్‌వర్క్ కూడా ఆకట్టుకుంటుంది.

కథకు తగ్గట్టుగా గ్రామీణ వాతావరణాన్ని తెరపై చూపించేందుకు ఆర్ట్ డిపార్ట్‌మెంట్ చేసిన కృషి ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాలు కూడా బాగున్నాయి.

ముఖ్యంగా కొన్ని ఫైట్స్‌ను కంపోజ్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. అయితే హింస, రక్తపాతాన్ని కొంత తగ్గించి ఉంటే బాగుండేది.

అలా చేసి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేదేమో. అలాగే నిడివి విషయంలోనూ మరింత జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది.

ADVERTISEMENT