LOADING...
Biker Overseas Review : శర్వానంద్ 'బైకర్' ఓవర్సీస్ టాక్.. ట్రాక్ మిస్ అయ్యిందా?
శర్వానంద్ 'బైకర్' ఓవర్సీస్ టాక్.. ట్రాక్ మిస్ అయ్యిందా?

Biker Overseas Review : శర్వానంద్ 'బైకర్' ఓవర్సీస్ టాక్.. ట్రాక్ మిస్ అయ్యిందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 03, 2026
10:01 am

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ హీరో శర్వానంద్, సీనియర్ నటుడు రాజశేఖర్ కలిసి నటించిన 'బైకర్' సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. రిలీజ్‌కు ముందే గత రాత్రి ప్రత్యేక ప్రీమియర్స్ ప్రదర్శించగా, ఓవర్సీస్ నుంచి ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది. కథ విషయానికి వస్తే.. మలేషియాలో జరిగే రేసింగ్ పోటీల్లో కోచ్‌గా వ్యవహరించే బుల్లెట్ సునీల్ (రాజశేఖర్) తన కొడుకు విక్కీ (శర్వానంద్)ను రేసర్‌గా తయారు చేస్తాడు. ఒక పోటీలో విక్కీ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల అతను రేసింగ్‌ను వదిలేస్తాడు. అనంతరం విక్కీ మళ్లీ రేసింగ్‌లోకి ఎందుకు వచ్చాడు? తండ్రి ఆశయాన్ని నెరవేర్చాడా లేదా? అనేదే కథలో ప్రధాన అంశం.

వివరాలు

పాజిటివ్ పాయింట్స్

ఈ చిత్రానికి ప్రధాన బలం శర్వానంద్, రాజశేఖర్ మధ్య కనిపించే తండ్రీకొడుకుల భావోద్వేగ అనుబంధం. రాజశేఖర్ తన కెరీర్‌లో మరోసారి బలమైన, ప్రభావవంతమైన పాత్రను పోషించారు. తండ్రి నుంచి వచ్చే మద్దతు, కొడుకు లక్ష్యం సాధించేందుకు పడే కష్టం చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుంది. సినిమాలోని రేసింగ్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయికి తగ్గకుండా తెరకెక్కించారు. ముఖ్యంగా ప్రథమార్థంలో వచ్చే 'జంప్ సీన్' థియేటర్లలో ప్రేక్షకులను ఉత్సాహపరుస్తుంది. శర్వానంద్ రేసర్‌గా కనిపించేందుకు చేసిన కృషి ప్రతి ఫ్రేమ్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. రేసింగ్ ట్రాక్‌పై యాక్షన్ సన్నివేశాలు ఉత్కంఠభరితంగా, గ్రిప్పింగ్‌గా సాగుతాయి. సంగీత దర్శకుడు జిబ్రాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ముఖ్యంగా రేసింగ్ సీన్లలో సౌండ్ మిక్సింగ్ ఎంతో ఆకట్టుకుంటుంది.

వివరాలు

నెగిటివ్ పాయింట్స్

ఈ చిత్రానికి ప్రధాన లోపం కథనే. మోటోక్రాస్ రేసింగ్ అనే కాన్సెప్ట్‌ను ఎంచుకున్నప్పటికీ, మిగిలిన కథను చాలా రొటీన్‌గా రూపొందించారు. స్క్రీన్‌ప్లే బలహీనంగా ఉండటం వల్ల కొన్ని చోట్ల బోరింగ్‌గా అనిపిస్తుంది. దర్శకుడు రేసింగ్ సీన్లపై ఎక్కువ దృష్టి పెట్టి, కథను మాత్రం సాధారణంగా తీర్చిదిద్దడం నిరాశ కలిగిస్తుంది. ప్రత్యేకంగా ఫస్ట్ హాఫ్ చాలా నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకులను విసిగిస్తుంది. పాటలు కూడా గుర్తుండేలా లేవు. హీరో రేసింగ్‌ను వదిలేయడానికి కారణమైన సంఘటనలు, మళ్లీ రేసింగ్‌లోకి రావాలనుకునే సన్నివేశాలు అంతగా ప్రభావం చూపలేకపోయాయి. దీంతో కథనం బలహీనంగా అనిపిస్తుంది. మొత్తంగా చూస్తే, 'బైకర్' సినిమా ఆరంభంలో జెట్ స్పీడ్‌తో ట్రాక్ ఎక్కినా, మధ్యలో దారి తప్పి ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది.

Advertisement