Loading...
George Krish Update: శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్.. రెట్రో మాస్ సాంగ్ షూటింగ్ ప్రారంభం
రెట్రో మాస్ సాంగ్ షూటింగ్ ప్రారంభం

George Krish Update: శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్.. రెట్రో మాస్ సాంగ్ షూటింగ్ ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 25, 2026
08:33 am

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ హీరో శర్వానంద్, ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'జార్జ్ క్రిష్'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది.ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ను వెల్లడించింది. ఈ సినిమాలో హై ఎనర్జీతో కూడిన రెట్రో మాస్ సాంగ్ చిత్రీకరణ ప్రారంభమైనట్లు నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన నిర్మాణ సంస్థ..'జార్జ్ క్రిష్'లో రెట్రో స్టైల్, మాస్ బీట్స్‌తో ప్రేక్షకులకు అదిరిపోయే వినోదం అందించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం హై ఎనర్జీ రెట్రో మాస్ సాంగ్ షూటింగ్ జరుగుతోందని పేర్కొంది. దర్శకుడు శ్రీనువైట్ల, హీరో శర్వానంద్ కలిసి వచ్చే సంక్రాంతికి ప్రేక్షకులను పూర్తి స్థాయిలో అలరించేందుకు సిద్ధమవుతున్నారని వెల్లడించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్ 

వివరాలు 

'జార్జ్ క్రిష్' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు

ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే స్పష్టం చేశారు.

గతంలో శర్వానంద్ నటించిన'శతమానం భవతి','ఎక్స్‌ప్రెస్ రాజా' సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచి మంచి విజయాలను అందుకున్నాయి.

దీంతో ఇప్పుడు 'జార్జ్ క్రిష్' సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రంలో శర్వానంద్‌కు జోడీగా మానస వారణాసి నటిస్తోంది.ఆమె పాత్రకు కథలో ఎంతో ప్రాధాన్యం ఉంటుందని చిత్ర బృందం వెల్లడించింది.

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని అనిల్ సుంకర సమర్పణలో రాంబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.

అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.

కేవీ గుహన్ సినిమాటోగ్రాఫర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ADVERTISEMENT