Loading...
Sharwanand: 'భోగి' రఫ్ కట్ చూసి ఫిదా అయిన శర్వానంద్.. సంపత్ నందికి మరో సినిమా ఓకే!
'భోగి' రఫ్ కట్ చూసి ఫిదా అయిన శర్వానంద్.. సంపత్ నందికి మరో సినిమా ఓకే!

Sharwanand: 'భోగి' రఫ్ కట్ చూసి ఫిదా అయిన శర్వానంద్.. సంపత్ నందికి మరో సినిమా ఓకే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 29, 2026
10:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ఒక సినిమా విడుదలకు ముందే హీరో, దర్శకుడి కాంబినేషన్‌లో మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ రావడం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి విశ్వాసమే ప్రస్తుతం హీరో శర్వానంద్, దర్శకుడు సంపత్ నంది మధ్య కనిపిస్తున్నట్లు టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న 'భోగి' సినిమా రఫ్ కట్‌ను ఇటీవల వీక్షించిన శర్వానంద్, సినిమా అవుట్‌పుట్‌పై పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

వివరాలు

'భోగి' రఫ్ కట్‌కు శర్వానంద్ ఫిదా

'నారీ నారీ నడుమ మురారి', 'బైకర్' చిత్రాలతో మళ్లీ విజయాల బాట పట్టిన శర్వానంద్.. ఇప్పుడు పూర్తి మాస్ అవతార్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భోగి' హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది.

ఇటీవల సినిమా రఫ్ కట్‌ను చూసిన శర్వానంద్.. కథను తెరపై ఆవిష్కరించిన విధానం, యాక్షన్ ఎపిసోడ్లు, భావోద్వేగ సన్నివేశాల ట్రీట్‌మెంట్‌ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, దర్శకుడిపై ప్రశంసలు కురిపించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

వివరాలు

మరో సినిమాకు కూడా ఓకే?

ముఖ్యంగా సంపత్ నంది వర్కింగ్ స్టైల్, కథను నడిపించిన తీరు శర్వానంద్‌ను బాగా ఇంప్రెస్ చేసినట్లు తెలుస్తోంది.

దీంతో 'భోగి' విడుదలకు ముందే సంపత్ నందితో మరో సినిమా చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

అయితే ప్రస్తుతం హీరో, దర్శకుడు ఇద్దరూ ఇప్పటికే అంగీకరించిన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో.. ఆ సినిమాలు పూర్తైన తర్వాత ఈ కొత్త కాంబినేషన్ మళ్లీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ADVERTISEMENT

వివరాలు

భారీ తారాగణంతో 'భోగి'

'భోగి' చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు.

ఈ సినిమాలో శర్వానంద్‌ను గతంలో ఎన్నడూ చూడని పూర్తి మాస్ పాత్రలో దర్శకుడు చూపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

యాక్షన్‌తో పాటు బలమైన భావోద్వేగాలు కూడా ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం చెబుతోంది.

ADVERTISEMENT

వివరాలు

వాయిదా పడిన విడుదల

మొదట ఈ చిత్రాన్ని ఆగస్టు 28న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే షూటింగ్‌లో ఇంకా కొంత భాగం మిగిలి ఉండటంతో విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించారు.

ప్రస్తుతం టాకీ పార్ట్‌తో పాటు మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో చిత్రబృందం నిమగ్నమై ఉంది.

అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

వివరాలు

'భోగి'పై పెరిగిన అంచనాలు

సినిమా విడుదలకు ముందే హీరో నుంచి దర్శకుడికి ఇంతటి విశ్వాసం లభించడం 'భోగి'పై అంచనాలను మరింత పెంచుతోంది.

ఒకవైపు రఫ్ కట్‌కు వస్తున్న సానుకూల స్పందన, మరోవైపు శర్వానంద్ మళ్లీ సంపత్ నందితో పనిచేయడానికి సిద్ధమవుతున్నారనే వార్తలు ఈ ప్రాజెక్ట్ చుట్టూ మంచి బజ్‌ను సృష్టిస్తున్నాయి.

ఇప్పుడు ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ థియేటర్లలో ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.

ADVERTISEMENT