Loading...
Tiger Shroff: బాలీవుడ్ హీరోపై కాల్పులు.. మేమే చేశామంటూ బిష్ణోయ్ గ్యాంగ్ పోస్టు?
బాలీవుడ్ హీరోపై కాల్పులు.. మేమే చేశామంటూ బిష్ణోయ్ గ్యాంగ్ పోస్టు?

Tiger Shroff: బాలీవుడ్ హీరోపై కాల్పులు.. మేమే చేశామంటూ బిష్ణోయ్ గ్యాంగ్ పోస్టు?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 19, 2026
09:08 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై ముంబయిలోని జుహూ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకోగా, ఆయన కారు డ్రైవర్ ఫిర్దౌస్, ఓ ఆటో డ్రైవర్ చౌహాన్ గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. టైగర్ ష్రాఫ్, ఆయన స్నేహితుడు ప్రయాణిస్తున్న వాహనంపై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో కారు డ్రైవర్ ఫిర్దౌస్ ఎడమ చేతికి గాయమైంది. కాల్పులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పోలీసులు అప్రమత్తమయ్యారు.

వివరాలు

కేసు నమోదు చేసిన పోలీసులు

కాల్పులకు పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. క్రైమ్ బ్రాంచ్ అధికారులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు, ఫోరెన్సిక్ బృందం ఘటనాస్థలాన్ని పరిశీలించి, తూటాలకు సంబంధించిన ఆనవాళ్లతో పాటు వాహనానికి సంబంధించిన కీలక ఆధారాలను సేకరించింది.

కాగా ఈ దాడికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టు వైరల్ అవుతోంది.

అయితే ఈ పోస్టు వెనుక ఉన్న వాస్తవాలపై స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ADVERTISEMENT