
స్పైడర్ మ్యాన్ సినిమాకు వాయిస్ ఇస్తున్న భారత క్రికెటర్ శుభ్ మన్ గిల్
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెటర్ శుభ్ మన్ గిల్ ఇప్పుడు తన వాయిస్ తో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు.
స్పైడర్ మ్యాన్ అక్రాస్ స్పైడర్ వెర్స్ అనే యానిమేషన్ సినిమాలో ఇండియన్ స్పైడర్ మ్యాన్ పవిత్ర్ ప్రభాకర్ పాత్రకు వాయిస్ అందివ్వబోతున్నాడు.
ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసాడు శుభ్ మన్ గిల్. మైదానంలో తన ఆటతీరుతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసే ఆటగాడు, ఈసారి తన మాటతీరుతో మాయ చేయడానికి వస్తున్నాడు.
సోనీ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా, జూన్ 2వ తేదీన ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మళయాలం, కన్నడ, పంజాబీ, గుజరాతీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్పైడర్ మ్యాన్ అక్రాస్ స్పైడర్ వెర్స్ సినిమా రిలీజ్ అవుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
డబ్బింగ్ ఆర్టిస్టుగా మారుతున్న శుభ్ మన్ గిల్
Shub-Man is now Spider-Man! 🕸️🏏
— Sony Pictures India (@SonyPicsIndia) May 8, 2023
Thrilled to have the talented @ShubmanGill as the voice of our very own - Indian Spider-Man, Pavitr Prabhakar in Spider-Man: Across the #SpiderVerse.
Trailer dropping soon! Get ready for some web-slinging action! 🕷️🇮🇳 pic.twitter.com/k38p4Gorkw