NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / వైరల్ వీడియో: శర్వానంద్ పెళ్ళిలో సిద్ధార్థ్ పాట; వావ్ అంటున్న అభిమానులు 
    తదుపరి వార్తా కథనం
    వైరల్ వీడియో: శర్వానంద్ పెళ్ళిలో సిద్ధార్థ్ పాట; వావ్ అంటున్న అభిమానులు 
    శర్వానంద్ పెళ్ళిలో పాట పాడిన సిద్ధార్థ్

    వైరల్ వీడియో: శర్వానంద్ పెళ్ళిలో సిద్ధార్థ్ పాట; వావ్ అంటున్న అభిమానులు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 07, 2023
    11:14 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ మధ్య హీరో సిద్ధార్థ్ ఎక్కడికి వెళ్లినా తన పాటలతో అందరినీ అలరిస్తున్నాడు. ఒకానొక టెలివిజన్ ప్రోగ్రాంలో అతిథిగా విచ్చేసిన సిద్ధార్థ్, బొమ్మరిల్లు సినిమాలోని పాటలు పాడి అందరికీ వినోదం పంచాడు.

    అలాగే తన తాజా సినిమా టక్కర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ తన గాత్రాన్ని వినిపించాడు.

    తాజాగా శర్వానంద్ పెళ్లిలో పాట పాడాడు. జూన్ 3వ తేదీన జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో రక్షిత రెడ్డితో శర్వానంద్ వివాహం వైభవంగా జరిగింది.

    ఈ వేడుకకు టాలీవుడ్ సెలబ్రిటీలు రామ్ చరణ్, సిద్ధార్థ్ అదితీ రావ్ హైదరీ హాజరయ్యారు. అయితే పెళ్లి వేడుకలో ఓయ్ ఓయ్ అనే పాటను సింగర్స్ ఆలపిస్తుండగా, సిద్ధార్థ్ నడుచుకుంటూ వచ్చి స్టేజ్ ఎక్కాడు.

    Details

    వైరల్ అవుతున్న వీడియో 

    సింగర్ చేతిలోంచి మైక్ తీసుకుని ఓయ్ అనే పాటను పూర్తిగా పాడి అందరినీ ఎంటర్ టైన్ చేసాడు. ప్రస్తుతం ఈ వీడియో, ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.

    హీరో సిద్ధార్థ్, శర్వానంద్ కలిసి మహాసముద్రం అనే సినిమాలో నటించారు. ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాను తెరకెక్కించాడు.

    మహాసముద్రం సినిమాకు ప్రేక్షకుల నుండి సరైన స్పందన రాలేదు. చాలా రోజుల తర్వాత సిద్ధార్థ్ నటించిన తెలుగు చిత్రం ఇది.

    ప్రస్తుతం టక్కర్ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు జూన్ 9వ తేదీన తీసుకొస్తున్నాడు. డబ్బు చుట్టూ తిరిగే ఈ కథలో సిద్ధార్థ్ అంతకు ముందు సినిమాల కంటే కొత్తగా కనిపించనున్నాడు.

    Embed

    శర్వానంద్ పెళ్ళిలో పాట పాడిన సిద్ధార్థ్ 

    Siddharth singing Oye Oye in Sharwanand Wedding

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వైరల్ వీడియో
    తెలుగు సినిమా

    తాజా

    SRH vs KKR: కోల్‌కతా ఘోర ఓటమి.. హ్యాట్రిక్ విజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించిన సన్ రైజర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్
    Sunrisers Hyderabad: ఐపీఎల్ చరిత్రనే తిరగరాసిన హైద‌రాబాద్.. అత్య‌ధిక స్కోర్ల జాబితా ఆరంజ్ ఆర్మీదే! సన్ రైజర్స్ హైదరాబాద్
    Kakani Govardhan: క్వార్ట్జ్‌ అక్రమాల కేసు.. మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి అరెస్టు కాకాణి గోవర్ధన్ రెడ్డి
    GT vs CSK : గుజరాత్ ఓటమి.. చివరి మ్యాచును విజయంతో ముగించిన సీఎస్కే చైన్నై సూపర్ కింగ్స్

    వైరల్ వీడియో

    గుజరాత్‌లోని సింహాన్ని తరిమికొట్టిన కుక్కల గుంపు వైరల్ అవుతున్న వీడియో గుజరాత్
    వైరల్ వీడియోలో నెటిజన్లను ఆకర్షిస్తున్న 'కన్వర్టబుల్' ఆటో-రిక్షా భారతదేశం
    వైరల్‌గా మారిన మార్క్ జుకర్‌బర్గ్ ర్యాంప్ వాక్ ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    నాగ్‌పూర్‌: ఆరేళ్లబాలుడిపై వీధికుక్కల దాడి; వీడియో వైరల్  మహారాష్ట్ర

    తెలుగు సినిమా

    అల్లు శిరీష్ కొత్త సినిమా బడ్డీ గ్లింప్స్ విడుదల: టెడ్డీ బేర్ ప్రపంచంలోకి స్వాగతం  గ్లింప్స్
    బాలయ్య 108వ సినిమా టైటిల్ లీక్: ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి  బాలకృష్ణ
    హ్యాపీ బర్త్ డే కృష్ణ: తెలుగు సినిమాకు కొత్త సాంకేతికతను పరిచయం చేసిన నటుడు  సినిమా
    బస్సు ప్రమాదానికి గురైన పుష్ప 2 నటులు: ఇద్దరికి తీవ్ర గాయాలు  పుష్ప 2
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025