Page Loader
Siddharth Marriage: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్, అదితి 
Siddharth Marriage: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్, అదితి

Siddharth Marriage: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్, అదితి 

వ్రాసిన వారు Stalin
Mar 27, 2024
02:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

హీరో సిద్దార్థ్ మరోసారి పెళ్లి పీటలెక్కాడు. హీరోయిన్ అదితి రావు హైదరిని పెళ్లి చేసుకున్నాడు. తెలంగాణ వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం ఆలయంలో ఈ రోజు (బుధవారం)ఇరు కుటుంబాలు,అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. తమిళనాడు పురోహితులు దగ్గరుండి పెళ్లి జరిపించారు. కొంతకాలంగా సిద్దార్థ్, అదితి రావు రిలేషన్ షిప్ లో ఉన్నారని వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి విషయం తెలిసిన ఫాన్స్ ఈ నూతన జంటకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సిద్ధార్థ్‌,అదితికి ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. 2003లో మేఘనని వివాహం చేసుకున్న సిద్ధార్థ్,ఆమెతో 2007లో విడిపోయాడు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. అతడి బాధ్యతలను సిద్ధార్థ్ చూసుకుంటున్నాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు హైదరి - సిద్ధార్థ్