Naga Vamsi : 'అర్జున్ రెడ్డి' తరహా సినిమాలో సిద్దూ జొన్నలగడ్డ
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ ఇండస్ట్రీలో 'డీజే టిల్లు' సినిమాతో స్టార్ హీరోగా సిద్ధూ జొన్నలగడ్డ గుర్తింపు పొందాడు.
ఆ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన 'డీజే టిల్లు -2' తో తన సక్సెస్‌ను కొనసాగించి సూపర్ హిట్ సినిమాల హీరోగా స్ధిరపడిపోయాడు.
ప్రస్తుతం సిద్ధూ కోహినూర్ సినిమాతో పాటు, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 'జాక్' అనే సినిమాతో, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న 'తెలుసు కదా' సినిమాలో నటిస్తున్నాడు.
తాజాగా సిద్దూ తో 'డీజే టిల్లు' నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
నాగవంశీ చెప్పినట్లు, తాను సిద్ధూతో సినిమా చేస్తానని, అది 'అర్జున్ రెడ్డి' తరహా కథతో ఉంటుందన్నారు.
Details
సినిమా కథపై చర్చలు
ప్రస్తుతం సినిమా కథపై చర్చలు జరుగుతున్నాయని, ఇంకా ఏం ఖచ్చితంగా ఫిక్స్ కాలేదన్నారు.
సిద్ధూ ఈ కథపై ఆసక్తి చూపిస్తున్నారని, ఈ మూవీలో సిద్ధూని విభిన్నంగా చూస్తారని చెప్పారు. అయితే ఈ చిత్రం వచ్చేసరికి కొంచెం సమయం పడుతుందన్నారు.
హిట్ అయితే కొత్తగా ట్రై చేసి సూపర్ అంటూ ప్రశంసిస్తారని, ప్లాప్ అయితే చేతులు కాల్చుకున్నారని విమర్శిస్తారని, అయినా ఈ కథతో సినిమా తీయడమే తమ లక్ష్యమని నాగవంశీ అన్నారు.
ఈ సినిమాపై మరిన్ని వివరాలు త్వరలోనే తెలియాల్సి ఉంది.