Loading...
The Vvaan : 'ది వీవాన్' టీజర్.. మైథలాజికల్ ఫాంటసీ థ్రిల్లర్‌లో తమన్నా, సిద్ధార్థ్ మల్హోత్రా!

The Vvaan : 'ది వీవాన్' టీజర్.. మైథలాజికల్ ఫాంటసీ థ్రిల్లర్‌లో తమన్నా, సిద్ధార్థ్ మల్హోత్రా!

వ్రాసిన వారు Moogati Shabari
Aug 26, 2026
01:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మైథలాజికల్ ఫాంటసీ థ్రిల్లర్ 'ది వీవాన్' (The Vvaan). దీపక్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అరుణాభ్ కుమార్ కథ అందించారు. బాలాజీ మోషన్ పిక్చర్స్, ది వైరల్ ఫీవర్ (TVF) సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది.

వివరాలు

రహస్యమైన శక్తి చుట్టూ సాగే కథ..

టీజర్‌ను చూస్తుంటే.. "సూర్యాస్తమయం తర్వాత ఎక్కడికి వెళ్లడం నిషిద్ధమో.. కథ అక్కడి నుంచే మొదలవుతుంది" అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది.

రాత్రి సమయంలో ఆ అడవిలోకి వెళ్లిన వారు తిరిగి రారనే ఓ భయానకమైన నమ్మకం, దాని వెనుక దాగి ఉన్న రహస్యమైన శక్తి చుట్టూ కథ సాగనున్నట్లు టీజర్ ద్వారా అర్థమవుతోంది.

వివరాలు

సరికొత్త యాక్షన్ అవతార్‌లో సిద్ధార్థ్ మల్హోత్రా..

ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా ఇప్పటివరకు కనిపించని సరికొత్త యాక్షన్ అవతార్‌లో కనిపిస్తున్నారు.

మరోవైపు ఆ అడవితో సిద్ధార్థ్ పాత్రకు ఏదో గూఢమైన సంబంధం ఉందని తమన్నా పాత్ర చెప్పడం ఆసక్తిని పెంచుతోంది.

టీజర్ చివర్లో చూపించిన విజువల్స్ దైవిక శక్తులు, పురాణాల నేపథ్యాన్ని తలపించేలా ఉన్నాయి.

ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా భాటియాలతో పాటు సునీల్ గ్రోవర్, మనీష్ పాల్, శ్వేతా తివారీ, అనూప్ సోని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సెప్టెంబర్ 25న ఈ మైథలాజికల్ ఫాంటసీ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ADVERTISEMENT