Loading...
Sigma OTT: నెలలోపే ఓటీటీలోకి 'సిగ్మా'.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
నెలలోపే ఓటీటీలోకి 'సిగ్మా'.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Sigma OTT: నెలలోపే ఓటీటీలోకి 'సిగ్మా'.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 27, 2026
11:15 am

ఈ వార్తాకథనం ఏంటి

విజయ్‌ కుమారుడు సంజయ్‌ దర్శకుడిగా పరిచయమైన చిత్రం 'సిగ్మా' (Sigma). అక్టోబర్‌ 2న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ ఫ్లిక్స్‌లో అక్టోబర్‌ 30 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ చిత్రంలో సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా నటించగా, ఆయనకు జోడీగా ఫరియా అబ్దుల్లా కనిపించారు.

వివరాలు

కథేంటంటే..

గురు (సందీప్‌ కిషన్‌) తన తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన లైబ్రరీని నిర్వహిస్తుంటాడు. అదే సమయంలో యూట్యూబ్‌లో స్టోరీ టెల్లర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటాడు.

అయితే తన తండ్రి చేసిన అప్పుల కారణంగా అతడు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంటాడు.

ఈ క్రమంలో తన ఇంటిని కాపాడుకోవాలంటే ఒక్క రాత్రిలోనే రూ.1.25 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

అంత పెద్ద మొత్తంలో డబ్బును ఎలా సంపాదించాలా అని గురు ఆలోచిస్తున్న సమయంలో.. క్యాసినో, డ్రగ్స్‌ పేరుతో ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటున్న గ్యాంగ్‌స్టర్‌ విన్సెంట్‌ (శివ్‌ పండిట్‌) నేరాలకు సంబంధించిన ఓ పెన్‌డ్రైవ్‌ అతడికి దొరుకుతుంది.

వివరాలు

ఆసక్తికరంగా కథ

ఆ పెన్‌డ్రైవ్‌ను ఆధారంగా చేసుకుని విన్సెంట్‌ను బ్లాక్‌మెయిల్‌ చేయాలని, తద్వారా తనకు కావాల్సిన డబ్బును సంపాదించాలని గురు ఓ ప్రణాళిక సిద్ధం చేసుకుంటాడు.

అయితే సరిగ్గా అదే సమయంలో కథలోకి అంతర్జాతీయ మాఫియా నాయకుడు వీరయ్య రెడ్డి (సంపత్‌ రాజ్‌) ప్రవేశిస్తాడు. తనకు చెందిన రూ.1,000 కోట్ల డబ్బుకు సంబంధించిన లాకర్‌ తాళం కోసం అతడు వెతుకుతుంటాడు.

దీంతో గురు వేసిన ప్రణాళిక అనుకోని మలుపులు తిరుగుతుంది.

ఆ తర్వాత ఏం జరిగింది? గురు తన ఇంటిని కాపాడుకోగలిగాడా? వీరయ్య రెడ్డి వెతుకుతున్న లాకర్‌ తాళం దొరికిందా? అన్నది సినిమాలో చూడాల్సిందే.

ADVERTISEMENT