SIIMA Awards 2026: సైమా అవార్డ్స్ విజేతలు.. తేజ సజ్జా, ఐశ్వర్య రాజేశ్‌కు అవార్డులు
ఈ వార్తాకథనం ఏంటి
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (South Indian International Movie Awards 2026) వేడుక అట్టహాసంగా జరిగింది. బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియం వేదికగా నిర్వహించిన ఈ అవార్డుల వేడుకకు దక్షిణాది సినీ తారలు పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేశారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలో భాగంగా తొలిరోజు తెలుగు, కన్నడ చిత్రాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డులను అందించారు. 'మిరాయ్' (Mirai) చిత్రంలో తన నటనకు గానూ యువ కథానాయకుడు తేజ సజ్జా (Teja Sajja) ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. 'మిరాయ్' చిత్రం విడుదలై ఏడాది పూర్తయిన నేపథ్యంలో తేజ సజ్జా ఈ అవార్డును అందుకోవడం మరో విశేషంగా నిలిచింది.
వివరాలు
ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి
ఇక 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunam) చిత్రంలో తన నటనకు గానూ ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) ఉత్తమ నటి (క్రిటిక్స్) అవార్డును సొంతం చేసుకున్నారు.
అదే చిత్రంలో బుల్లిరాజు అలియాస్ భీమల రేవంత్ తన నటనతో ప్రేక్షకులను అలరించారు. దీంతో ఉత్తమ హాస్యనటుడి అవార్డు ఆయనకు దక్కింది.
మరోవైపు 'కాంతార: చాప్టర్ 1' చిత్రంలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కన్నడ నటుడు రిషబ్‌శెట్టి (Rishab Shetty) ఉత్తమ నటుడి అవార్డును సొంతం చేసుకున్నారు.
వివరాలు
అవార్డులు అందుకున్న సినీతారలు వీళ్లే
ఉత్తమ నటుడు - తేజ సజ్జా ('మిరాయ్')
ఉత్తమ నటి - ఐశ్వర్య రాజేశ్ ('సంక్రాంతికి వస్తున్నాం')
ఉత్తమ హాస్య నటుడు - బుల్లిరాజు ('సంక్రాంతికి వస్తున్నాం')
ఉత్తమ నేపథ్య గాయకుడు - రమణ గోగుల ('సంక్రాంతికి వస్తున్నాం')
ఉత్తమ నేపథ్య గాయని - సమీరా భరద్వాజ్ ('కోర్టు')
ఉత్తమ నటి (పరిచయ) - సాక్షి మడోల్కర్ ('మోగ్లీ')