ఆదికేశవ ఫస్ట్ సింగిల్: ఆకట్టుకుంటున్న సిత్తరాల సిత్రావతి ప్రోమో
ఉప్పెన సినిమాతో హీరోగా మారిన పంజా వైష్ణవ్ తేజ్, ఆ తర్వాత కొండపొలం, రంగరంగ వైభవంగా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాడు. ప్రస్తుతం వైష్ణవ తేజ్ నుండి ఆదికేశవ చిత్రం వస్తోంది. ఈ సినిమాలో పంజా వైష్ణవ తేజ్ చాలా కొత్తగా కనిపించబోతున్నాడు. ఆ విషయం గ్లింప్స్ వీడియోలో కనిపించింది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా మొదటి పాట ప్రోమో విడుదలైంది. సిత్తరాల సిత్రావతి అనే పాట ప్రోమో ఆకట్టుకునేలా ఉంది. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్న ఈ పాటను సెప్టెంబర్ 9న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు.