Page Loader
Pushpa 2: 'సూసేకీ అగ్గిరవ్వ మాదిరే' వీడియో సాంగ్ రిలీజ్

Pushpa 2: 'సూసేకీ అగ్గిరవ్వ మాదిరే' వీడియో సాంగ్ రిలీజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 29, 2024
03:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన తాజా బ్లాక్‌బస్టర్ 'పుష్ప 2: ది రూల్' ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటించింది. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా రూ.1740 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం, మరికొద్ది రోజుల్లో అత్యధిక వసూళ్లు సాధించి 'బాహుబలి' (రూ.1804 కోట్ల) రికార్డును అధిగమించనుంది. ఇదిలా ఉండగా, చిత్రబృందం ఈ మూవీ నుండి ఫుల్ వీడియో సాంగ్స్‌ను వరుసగా విడుదల చేస్తోంది.

Details

నాలుగు పాటలు రిలీజ్

ఇప్పటికే 'పుష్ప రాజ్', 'కిస్సిక్‌', 'దమ్ముంటే పట్టుకోరా షేకావత్‌' పాటలను విడుదల చేసిన మేకర్స్, తాజాగా 'సూసేకి.. అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి' పాట ఫుల్ వీడియోను విడుదల చేశారు. గంగో రేణుక తల్లి పాట తర్వాత సెకండాఫ్‌లో వచ్చే ఈ పాట సినిమా హైలైట్‌గా నిలిచింది. థియేటర్‌లో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ సాంగ్‌ను ఇప్పుడు అభిమానులు ఆన్లైన్‌లో చూసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ఈ సాంగ్ మరోసారి పుష్ప 2 క్రేజ్‌ను పెంచుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మీరు కూడా ఈ పాటను మిస్ కాకుండా చూసేయండి!