LOADING...
Mani Ratnam: క్షమించండి.. 'నాయకుడు' స్థాయిని అందుకోలేకపోయా : మణిరత్నం
క్షమించండి.. 'నాయకుడు' స్థాయిని అందుకోలేకపోయా : మణిరత్నం

Mani Ratnam: క్షమించండి.. 'నాయకుడు' స్థాయిని అందుకోలేకపోయా : మణిరత్నం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 23, 2025
05:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

తన దర్శకత్వంలో తెరకెక్కిన 'థగ్‌ లైఫ్‌' (Thug Life) సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిందని దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) అంగీకరించారు. ఈ విషయంలో ఆయన ప్రేక్షకులకు క్షమాపణలు తెలిపారు. ప్రేక్షకులు మరో క్లాసిక్‌ మూవీని ఆశించారని చెప్పారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో 'థగ్‌ లైఫ్‌' ఫలితంపై మణిరత్నం స్పందించారు. 'మా ఇద్దరి నుంచి మరో 'నాయకుడు' (Nayakudu) సినిమా రాకపోవడంపై ప్రేక్షకులకు క్షమాపణలు తెలుపుతున్నా. మేమెప్పుడూ 'నాయకుడు'కంటే తక్కువ సినిమా చేయాలని అనుకోలేదు. అలా ఎలా అనుకుంటాము? మేం పూర్తిగా భిన్నమైనదాన్ని అందించాలనుకున్నాం.

Details

ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిన థగ్ లైఫ్

కానీ, ఎక్కువ అంచనాల కారణంగా మేము అందించినదానికంటే భిన్నంగా ప్రేక్షకులు కోరుకున్నారు. అది మాకు అర్థమైందని మణిరత్నం తెలిపారు. ప్రస్తుతం ఆయన తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఒక శక్తివంతమైన కథా సరళితో రాబోతున్నారని, దీని కోసం ఇప్పటికే పనులను ప్రారంభించినట్టు వెల్లడించారు. క‌మ‌ల్‌ హాస‌న్‌ (Kamal Haasan) మ‌ణిర‌త్నం కాంబినేషన్‌ ఎప్పటినుంచో ప్రత్యేకం. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన 'నాయకుడు' అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. దాదాపు 37 ఏళ్ల తర్వాత ఈ ద్వయం కలయికలో తెరకెక్కిన 'థగ్‌ లైఫ్‌' సినిమా జూన్‌ 5న విడుదలై ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.