
Squid Game: 'స్క్విడ్‌గేమ్' లో కీలక పాత్ర పోషించిన నటుడు ఓ యోంగ్ సు కి జైలు శిక్ష
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా విశేషమైన ప్రజాదరణను పొందిన 'స్క్విడ్ గేమ్' (Squid Game)లో కీలక పాత్ర పోషించి గుర్తింపు పొందిన కొరియన్ నటుడు ఓ యోంగ్ సు (O Yeong Su), 80 ఏళ్ల వయస్సులోనూ అద్భుతమైన అభినయంతో అందరి ప్రశంసలు పొందారు.
అయితే, ఇటీవల అతనిపై వేధింపుల కేసు నమోదవడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా ఈ కేసును విచారించిన న్యాయస్థానం, అతనికి జైలు శిక్షను విధించింది.
స్థానిక మీడియా నివేదికల ప్రకారం,సినీ పరిశ్రమలో దాదాపు 50 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఓ యోంగ్ సు,కొన్ని సంవత్సరాల క్రితం ఓ జూనియర్ ఆర్టిస్ట్‌ను వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి.
వివరాలు
కోర్టును ఆశ్రయించిన బాధితురాలు
ఆమెను లైంగికంగా వేధించాడని బాధితురాలు కోర్టును ఆశ్రయించింది.
ఈ ఘటన తర్వాత తనకు పని చేయాలన్న భయంతో జీవనం కష్టమైందని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. యాక్టింగ్ ఆమె జీవనాధారం మాత్రమేనని పేర్కొన్నారు.
కోర్టు విచారణలో ఓ యోంగ్ సు తన చర్యల్లో ఎలాంటి తప్పు లేదని చెప్పడం, పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా తనను తాను సమర్థించుకోవడం గమనార్హం.
ఇరు పక్షాల వాదనలు, అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం, అతనికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.