భాగ్ సాలే ట్రైలర్: కేసీఆర్ కు తెలంగాణ ఇష్టం, నాకు నువ్వు ఇష్టం; ఇంట్రెస్టింగ్ గా సాగిన ట్రైలర్
ఈ వార్తాకథనం ఏంటి
మత్తువదలరా చిత్రంతో వెండితెరకు పరిచయమైన కీరవాణి కొడుకు శ్రీ సింహా, ప్రస్తుతం భాగ్ సాలే అంటున్నాడు. నేహా సోలంకి హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఈరోజు విడుదలైంది.
భాగ్ సాలే గ్లింప్స్ వీడియోలో వజ్రపు ఉంగరం గురించి డీజె టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డతో ఒక కథ చెప్పించారు. ఆ కథకు కొనసాగింపుగా ఇప్పుడు రిలీజైన ట్రైలర్ కనిపిస్తోంది.
సినిమా మొత్తం వజ్రపు ఉంగరం కోసమే ఉన్నట్టు కనిపిస్తోంది. కాకపోతే మధ్యలో హీరో లవ్ ట్రాక్, అందులో వచ్చే కామెడీ సన్నివేశాలు నవ్వులు తెప్పిస్తాయని ట్రైలర్ లో అర్థమవుతోంది.
ట్రైలర్ మొత్తం ఫన్నీగా, ఫాస్ట్ గా ఆసక్తిగా సాగిపోయింది. అక్కడక్కడా కొన్ని బూతు మాటలు కూడా వినిపించీ వినిపించకుండా వినిపించాయి.
Details
ట్రైలర్ లో కనిపిస్తున్న పాజిటివ్ లక్షణాలు
ఎన్నో రోజులుగా మంచి హిట్ కోసం శ్రీ సింహా ఎదురుచూస్తున్నాడు. మత్తు వదలరా చిత్రం ఫర్వాలేదనిపించింది కానీ ఆ తర్వాత వచ్చిన ఏ చిత్రం కూడా అనుకున్న స్థాయిలో ఆడలేదు.
భాగ్ సాలే ట్రైలర్ చూస్తుంటే పాజిటివ్ అంశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాలభైరవ అందించిన మ్యూజిక్, ట్రైలర్ కు తగినట్లుగా ఉంది.
కేసీఆర్ కు తెలంగాణ ఎంతిష్టమో, నాకు నువ్వు అంత ఇష్టం అనే రకం డైలాగులు ఆసక్తిగా ఉన్నాయి. రాజీవ్ కనకాల, జాన్ విజయ్, కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.
వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బిగ్ బెన్ మూవీస్, సినీ వ్యాలీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను ప్రణీత్ బ్రమాండపల్లి డైరెక్ట్ చేస్తున్నారు. జులై 7వ తేదిన థియేటర్లలోకి వచ్చేస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
భాగ్ సాలే ట్రైలర్ విడుదల
"Shali Shuka Gaja" ఎవడిదగ్గరుంటే వాడి లైఫ్ రిచ్చవ్వటంతో పాటు రచ్చ కూడా ఉంటది...#BhaagSaale Trailer💍https://t.co/hHtgY3IBfv
— Sri Simha Koduri (@Simhakoduri23) June 26, 2023
Chase Begins on July 7th🏃🏻♂️@NehaSolanki_ @IamPranithB @kaalabhairava7 @arjundasyan @VCWOfficial @YashBigBen @KALYANASINGAMA1 @GskMedia_PR @adityamusic pic.twitter.com/XP6WHlNvnA