
భాగ్ సాలే గ్లింప్స్: బ్రిటీష్ కాలం నాటి వజ్రం కథను పరిచయం చేసిన డీజే టిల్లు
ఈ వార్తాకథనం ఏంటి
సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి కొడుకు శ్రీ సింహా, మరో కొత్త సినిమాతో ముందుకు వస్తున్నాడు. భాగ్ సాలే అనే క్రేజీ టైటిల్ తో వస్తున్న ఈ చిత్ర గ్లింప్స్ ఈరోజు విడుదలైంది.
డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ వాయిస్ ఓవర్ తో ఈ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేసారు. గ్లింప్స్ వీడియోను యానిమేషన్ బొమ్మలతో నింపేసి, సిద్ధుతో ఒక కథను చెప్పించారు.
బ్రిటీష్ కాలం కంటే కొల్లూరులో దొరికిన ఒక వజ్రం, బ్రిటీషర్ల నుండి నిజాం నవాబును చేరుకుని ఆ తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళిందనేది చూపించారు.
ఆ వజ్రంతో తయారైన 9ఉంగరాలు ఒక్కో చోట ఉన్నాయని చూపించి, అందులో ఒకటి హీరో దగ్గర ఉందని చూపించారు.
Details
జులై 7న రిలీజ్ అవుతున్న భాగ్ సాలే
ఆ ఉంగరం దొరికిన వారి జీవితం రకరకాలుగా పరుగులు పెడుతుందని చూపిస్తూ శ్రీ సింహాను పరిచయం చేసారు. గ్లింప్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతుందని గ్లింప్స్ వీడియోలో ప్రకటించారు.
ఈ సినిమాలో నేహా సోలంకి హీరోయిన్ గా కనిపిస్తోంది. రాజీవ్ కనకాల, జాన్ విజయ్, వర్షిణి సౌందరాజన్, నందినీ రాయ్, వైవా హర్ష కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను, వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బిగ్ పెన్ సినిమా, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. జులై7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ అవుతుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
భాగ్ సాలే గ్లింప్స్ విడుదల
మీ అందరికీ నేనొక కథ చెప్తా!!
— Sri Simha Koduri (@Simhakoduri23) June 21, 2023
Shali Shuka Gaja అంటే తెల్సా?
Know it from #WorldOfBhaagSaale 💍https://t.co/2DJ2i2qida
Voiceover by Star Boy #SiddhuJonnalagadda 😎💥#BhaagSaale @Simhakoduri23 @IamPranithB @kaalabhairava7 @arjundasyan @VCWOfficial @YashBigBen @adityamusic pic.twitter.com/9CzJ1NG4cL