Loading...
Sri Vishnu: శ్రీవిష్ణు కొత్త ప్రయోగం.. కంఫర్ట్ జోన్‌కు గుడ్‌బై?
శ్రీవిష్ణు కొత్త ప్రయోగం.. కంఫర్ట్ జోన్‌కు గుడ్‌బై?

Sri Vishnu: శ్రీవిష్ణు కొత్త ప్రయోగం.. కంఫర్ట్ జోన్‌కు గుడ్‌బై?

వ్రాసిన వారు Balachander Sharma
Oct 31, 2026
12:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లతో ప్రేక్షకులకు దగ్గరైన యువ హీరో శ్రీవిష్ణు ఇప్పుడు కొత్త కథతో మెప్పించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎక్కువగా వినోదాత్మక పాత్రల్లో కనిపించిన ఆయన.. ఈసారి పౌరాణిక నేపథ్యంతో కూడిన మైథలాజికల్ సినిమాలో నటించబోతున్నారనే వార్త టాలీవుడ్‌లో ఆసక్తి పెంచుతోంది. ఈ ప్రాజెక్టు ఖరారైతే శ్రీవిష్ణు కెరీర్‌లో ఇదొక భిన్నమైన ప్రయత్నంగా నిలవనుంది.

Details

పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో కొత్త కథ

'రంగబలి' సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న పవన్ బాసంశెట్టి ఈ చిత్రానికి కథ సిద్ధం చేసినట్లు సమాచారం.

భారతీయ సంస్కృతి, పురాణాల్లోని అంశాలను ఆధునిక కథనంతో కలిపి ఈ సినిమాను రూపొందించాలని భావిస్తున్నారట. సాధారణ పౌరాణిక చిత్రాలకు భిన్నంగా నేటి ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయ్యేలా కథను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.

ఇందులో శ్రీవిష్ణు పాత్ర ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండనుందనే ప్రచారం జరుగుతోంది.

Details

భారీ నిర్మాణానికి నిర్మాత సుధాకర్ చెరుకూరి?

ఎస్ఎల్వీ సినిమాస్ అధినేత, నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు టాక్.

భారీ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం కథా చర్చలు, ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం.

అయితే చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన, నటీనటులు, బడ్జెట్ వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

ADVERTISEMENT

Details

రెండు సినిమాలు పూర్తయ్యాకే సెట్స్‌పైకి

ప్రస్తుతం శ్రీవిష్ణు 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో 'ఫ్యామిలీ ప్యాక్' సినిమా చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. మరోవైపు పవన్ బాసంశెట్టి కూడా సత్య, యోగిబాబులతో రూపొందిస్తున్న 'గోల్డెన్ భాగ్యం' పనుల్లో బిజీగా ఉన్నారు.

ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే శ్రీవిష్ణు మైథలాజికల్ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు కామెడీతో ప్రేక్షకులను అలరించిన ఆయన పౌరాణిక పాత్రలో ఎలా కనిపిస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT