దసరా దర్శకుడికి మరో హీరో దొరికేసాడు, ఈ సారి కూడా పాన్ ఇండియా లెవెల్లో?
ఈ వార్తాకథనం ఏంటి
మొదటి సినిమాతోనే వందకోట్ల క్లబ్ లో చేరిన దర్శకులు దాదాపుగా తక్కువ. అలాంటి వాళ్ళ సరసన దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేరిపోయారు. దసరా సినిమాతో బాక్సాఫీసును బద్దలు కొట్టాడు.
నేచురల్ స్టార్ నానికి వందకోట్ల చిత్రాన్ని అందించాడు శ్రీకాంత్. ప్రస్తుతం శ్రీకాంత్ కోసం నిర్మాణ సంస్థలు పరుగులు పెడుతున్నాయి. అందరికంటే ముందుగా కర్చీఫ్ వేసేయడానికి రెడీ ఐపోతున్నారు.
సినిమాకోసం పెద్ద పెద్ద బడ్జెట్లు, గొప్ప పారితోషికం ఇచ్చేందుకు నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో దసరా దర్శకుడి తర్వాతి సినిమా ఏ హీరోతో ఉంటుందన్న ఆసక్తి అందరికీ ఉంటుంది.
తాజాగా దసరా దర్శకుడికి హీరో దొరికేసాడని టాక్ నడుస్తోంది.
శ్రీకాంత్ ఓదెల
అక్కినేని అఖిల్ తో దసరా దర్శకుడి రెండవ చిత్రం
అక్కినేని అఖిల్ ని శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేయబోతున్నారని అంటున్నారు. మరికొద్ది రోజుల్లో అఖిల్ కు కథ వినిపించడానికి శ్రీకాంత్ సిద్ధం అవుతున్నారట.
ప్రస్తుతం ఏజెంట్ పనుల్లో అఖిల్ బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకు సిద్ధంగా ఉన్న ఏజెంట్ ప్రమోషన్లు ఇటీవలే మొదలయ్యాయి.
ఏజెంట్ రిలీజ్ కాగానే శ్రీకాంత్ ఓదెలకు సమయం ఇస్తాడట. అన్నీ కుదిరితే చాలా తక్కువ టైమ్ లో షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. ఇది కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటుందని టాక్.
మరేం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతానికి దసరా విజయోత్సవాల్లో శ్రీకాంత్ ఉంటే, ఏజెంట్ సినిమా విడుదల పనుల్లో అఖిల్ ఉన్నాడు.