దసరా మూవీ: 80కోట్ల వసూళ్ళకు 80లక్షల కారు గిఫ్ట్
నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన దసరా మూవీకి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. రిలీజైన 4రోజుల్లో 80కోట్లకు పైగా వసూళ్ళు అందుకుంది ఈ చిత్రం. ఈ నేపథ్యంలో దసరా సినిమాను మనకు అందించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు కాస్ట్ లీ కారును బహుమతిగా ఇవ్వడానికి చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి రెడీ అవుతున్నారు. 80లక్షల విలువ గల BMW కారును నాని చేతుల మీదుగా అందించాలని చిత్రనిర్మాత అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అలాగే దసరా ఇంతలా ప్రభంజనం సృష్టిస్తుండడంలో కీలక పాత్ర పోషించిన వారికి గోల్డ్ కాయిన్స్ ఇవ్వబోతున్నారని వినిపిస్తోంది. మరి ఈ కార్యక్రమం ఎప్పుడు ఉంటుందనేది ఇంకా తెలియదు.
దసరా దర్శకుడిపై పడుతున్న ప్రశంసలు
దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలపై ఇండస్ట్రీ పెద్దలు ప్రశంసలు కురిపిస్తున్నారు. రాజమౌళి, సుకుమార్ సహా చాలామంది శ్రీకాంత్ దర్శకత్వ ప్రతిభను మెచ్చుకున్నారు. మొదటి సినిమాతోనే ఇంతమంచి ఔట్ పుట్ తీసుకొచ్చినందుకు శ్రీకాంత్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. పెద్ద నిర్మాణ సంస్థల అధిపతులు శ్రీకాంత్ ఓదెలతో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు. మొత్తానికి శ్రీకాంత్ సుడి తిరిగిపోయింది. దసరా తో బాక్సాఫీసును దడదడలాడించి ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. ఇప్పటివరకు 80కోట్లకు పైగా వసూలు చేసిన దసరా, మరికొద్ది రోజుల్లో 100కోట్ల మార్కును అందుకుంటుందని ఊహిస్తున్నారు. అదే నిజమైతే నాని కెరీర్లో మొదటి వందకోట్ల సినిమా అవుతుంది. దసరా సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించింది.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి