దసరా మూవీ: కోస్తాంధ్రలో రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న నాని
దసరా మూవీకి వచ్చినంత హైప్, ఈ మధ్య కాలంలో ఏ సినిమాకూ రాలేదు. నాని చేసిన ప్రమోషన్స్, చమ్కీల అంగీలేసి పాట, సినిమా బృందం రిలీజ్ చేసిన ప్రమోషనల్ మెటీరియల్ అన్నీ కలిపి దసరా సినిమాపై ఆసక్తిని విపరీతంగా పెంచేసాయి. మార్చ్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది దసరా. రిలీజైన ప్రతీచోట రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. కోస్తాంద్ర బాక్సాఫీసు వద్ద దసరా సాధించిన కలెక్షన్లు నాని కెరీర్లోనే అత్యధికంగా నిలిచాయి. మొదటిరోజు కోసాంధ్రలో 4.72కోట్లు వసూళ్ళు చేసింది దసరా మూవీ. కోస్తాంధ్రలో మొదటి రోజు ఇన్ని కలెక్షన్లు రావడం నాని కెరీర్లోనే ఇది మొదటిసారి. ఈ లెక్కన చూసుకుంటే దసరా మూవీ, సరికొత్త రికార్డులు సృష్టించనుంది.
అమెరికాలో మిలియన్ డాలర్ కు చేరువలో
ఇటు నైజాంలో దసరా దూకుడు మరింత వేగంగా ఉంది. మొదటిరోజు 6.78కోట్ల వసూళ్ళు సాధించినట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇక అమెరికాలో దసరా కలెక్షన్లు మిలియన్ డాలర్ కు దగ్గర్లో ఉన్నాయి. ఇప్పటివరకు 8లక్షల డాలర్లకు పైగా వసూళ్ళు సాధించినట్లు వినిపిస్తోంది. ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే నాని కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా దసరా నిలవనుందని అర్థమవుతోంది. మరేం జరుగుతుందనేది చూడాలి. దసరా చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించింది. దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, ప్రధాన పాత్రల్లో మెరిసారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.