Sreeleela: తమిళనాడు కోడలిగా మారనున్న శ్రీలీల..? కోలీవుడ్‌లో హాట్ టాపిక్!
ఈ వార్తాకథనం ఏంటి
తక్కువ సమయంలోనే టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వరుస సినిమాలతో కెరీర్‌లో దూసుకెళ్తున్న ఆమె తాజాగా చెన్నైలో జరిగిన అమృత ఏవియేషన్ కాలేజ్ ఈవెంట్‌లో బ్రాండ్ అంబాసిడర్‌గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో సరదాగా ముచ్చటించిన శ్రీలీల, తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆమెను "లేడీ సూపర్ స్టార్" అంటూ నినాదాలు చేశారు. అయితే శ్రీలీల ఎంతో వినయంగా ఆ ట్యాగ్‌ను తిరస్కరించారు. నాకు అత్యంత ఇష్టమైన నటి నయనతార.
వివరాలు
ఆ స్థాయికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది
ఆమె మాత్రమే అసలైన లేడీ సూపర్ స్టార్. ఆమె నాకు రోల్ మోడల్. ఆ స్థాయికి చేరుకోవడానికి నాకు ఇంకా చాలా సమయం పడుతుందంటూ శ్రీలీల వ్యాఖ్యానించారు. అలాగే జీవితంలో ఓటమికి భయపడకుండా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలని విద్యార్థులకు సూచించారు. కష్టపడి ముందుకు సాగితేనే విజయాలు సాధ్యమవుతాయని ఆమె ప్రోత్సాహకరంగా మాట్లాడారు. ఇదే కార్యక్రమంలో తన పెళ్లికి సంబంధించిన శ్రీలీల వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.