NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / మహేష్ బాబు 28: ఫైట్ మాస్టర్లను మార్చేసి షూటింగ్ మొదలుపెడుతున్న త్రివిక్రమ్
    తదుపరి వార్తా కథనం
    మహేష్ బాబు 28: ఫైట్ మాస్టర్లను మార్చేసి షూటింగ్ మొదలుపెడుతున్న త్రివిక్రమ్
    మహేష్ బాబు 28 సినిమా షుటింగ్ రేపటి నుండే మొదలు

    మహేష్ బాబు 28: ఫైట్ మాస్టర్లను మార్చేసి షూటింగ్ మొదలుపెడుతున్న త్రివిక్రమ్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jan 17, 2023
    11:55 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ చిత్ర షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభమైంది.

    యాక్షన్ సీక్వెన్స్ తో ప్రారంభమైన చిత్రీకరణ మధ్యలోనే ఆగిపోయింది. యాక్షన్ సన్నివేశాలు మహేష్ కి నచ్చలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. దాంతో త్రివిక్రమ్ మళ్ళీ స్క్రిప్ట్ కి మెరుగులు దిద్దాడని అంటున్నారు.

    ప్రస్తుతం అన్ని పనులు పూర్తి చేసుకుని పక్కా ప్లానింగ్ తో షూటింగ్ లోకి దిగుతున్నారట. ఈసారి యాక్షన్ సీక్వెన్సెస్ కోసం ఆన్బారివ్ లని రామ్ లక్ష్మణ్ లని తీసుకున్నారట.

    రేపటి నుండి సినిమా చిత్రీకరణ, హైదరాబాద్ లోని స్టూడియో ఉండనుందని చెప్పుకుంటున్నారు. ఈ షుటింగ్ లో మహేష్ బాబు పాల్గొంటున్నాడని సమాచారం.

    మహేష్ బాబు

    పూర్తి యాక్షన్ కాకుండా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మారిన స్క్రిప్ట్

    ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ గా త్రివిక్రమ్ రాసుకున్నారట. కానీ అలా కాకుండా ప్రస్తుతం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మారిపోయిందని వినిపిస్తోంది. యాక్షన్ సన్నివేశాలకు పెద్దపీట వేస్తూనే ఫ్యామిలీకి నచ్చేలా మార్చారని టాక్.

    ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. 2023లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    ఈ సినిమా పూర్తయ్యాక రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నాడు మహేష్ బాబు. కథా పనులు పూర్తయ్యాయని, ప్రపంచాన్ని చుట్టివచ్చే ప్రయాణికుడి కథలా ఈ సినిమా ఉంటుందని రాజమౌళి ఇదివరకే చెప్పారు.

    అంతేగాక, ఈ సినిమా మీద ఫ్రాంఛైజీస్ కూడా వస్తాయని కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా

    తాజా

    Shreyas Iyer: ఐపీఎల్ చరిత్రలో తొలి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఘనత శ్రేయస్ అయ్యర్
    Bill Gates: 2045 నాటికి మెరుగైన ప్రపంచం కోసం బిల్ గేట్స్ ఛాలెంజ్‌.. సాయం చేయాలంటూ తోటి బిలియనీర్లకు పిలుపు.. మైక్రోసాఫ్ట్
    INDIA vs PAKISTAN: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆసియా కప్ 2025 నుంచి డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ నిష్క్రమణ  బీసీసీఐ
    Tata Harrier EV: జూన్ 3న టాటా హారియర్ ఈవీ లాంచ్‌.. 500 కిమీ రేంజ్‌తో రావనున్న కొత్త ఫ్లాగ్‌షిప్‌ SUV! టాటా హారియర్

    తెలుగు సినిమా

    డైరెక్టర్ ఎవరో రివీల్ చేయకుండా నాని 30వ సినిమా ప్రకటన సినిమా
    అమెరికాలో వీరసింహారెడ్డి వీరంగం.. వీరయ్యను దాటి సినిమా
    పెళ్ళి చేసుకోబోతున్న నరేష్, పవిత్ర.. ముద్దు పెట్టి మరీ ప్రకటన సినిమా
    2022: తెలుగు తెరకు పరిచయమైన డబ్బింగ్ హీరోలు.. మొదటి స్థానంలో ఎవరున్నారంటే టాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025