LOADING...
Fauzi: లీక్స్‌పై కఠిన హెచ్చరిక.. 'ఫౌజీ' టీమ్‌ నుంచి యాక్షన్ వార్నింగ్
లీక్స్‌పై కఠిన హెచ్చరిక.. 'ఫౌజీ' టీమ్‌ నుంచి యాక్షన్ వార్నింగ్

Fauzi: లీక్స్‌పై కఠిన హెచ్చరిక.. 'ఫౌజీ' టీమ్‌ నుంచి యాక్షన్ వార్నింగ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 05, 2026
10:32 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఫౌజీ. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతుందో చూపించే కొన్ని ఫొటోలు ఇటీవల ఆన్‌లైన్‌లో లీక్ కావడం కలకలం రేపింది. ప్రస్తుతం ఆ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం అధికారికంగా స్పందిస్తూ కీలక ప్రకటన విడుదల చేసింది. సినిమా సెట్స్ నుంచి లీకైన ఫొటోలను కొన్ని సోషల్ మీడియా ఖాతాలు సర్క్యూలేట్ చేస్తున్నాయని తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారికి కఠిన హెచ్చరిక జారీ చేసింది. "అనధికారిక కంటెంట్‌ను పంచుతున్న వారిపై ఫిర్యాదులు నమోదు చేస్తాం. అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాం. ఈ విధమైన లీకులు మా కష్టాన్ని దెబ్బతీస్తున్నాయి.

వివరాలు

చివరి దశకు చేరుకున్న షూటింగ్

ప్రేక్షకులకు వెండితెరపై ఒక అద్భుత అనుభూతిని అందించేందుకు మేమంతా కృషి చేస్తున్నాం. మీ అంచనాలకు తగ్గ ఫలితం అందిస్తాం. కాబట్టి లీక్ అయిన కంటెంట్‌ను ఎవరూ షేర్ చేయవద్దని చిత్రబృందం విజ్ఞప్తి చేసింది. ఇక దర్శకుడు హను రాఘవపూడి కూడా ఎక్స్(ట్విట్టర్)వేదికగా స్పందించారు. "మీకు చిరస్మరణీయంగా నిలిచే కంటెంట్‌ను అందించేందుకు మేమంతా ఎంతో కష్టపడుతున్నాం. దయచేసి లీక్స్ ద్వారా ఆ మ్యాజిక్‌ను పాడు చేయవద్దని అభిమానులను కోరారు. 'ఫౌజీ' సినిమా విషయానికి వస్తే, ఇది 1940ల నేపథ్యంతో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తుండగా, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

Advertisement