Loading...
Akka Trailer: అమాయకంగా కనిపించే కీర్తి సురేశ్‌లో ఇంత వైలెన్సా.. 'అక్క' ట్రైలర్ చూశారా?
అమాయకంగా కనిపించే కీర్తి సురేశ్‌లో ఇంత వైలెన్సా.. 'అక్క' ట్రైలర్ చూశారా?

Akka Trailer: అమాయకంగా కనిపించే కీర్తి సురేశ్‌లో ఇంత వైలెన్సా.. 'అక్క' ట్రైలర్ చూశారా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 23, 2026
11:25 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎప్పుడూ పక్కింటి అమ్మాయిలా, ఎంతో అమాయకంగా కనిపించే నటి కీర్తి సురేష్ ను చూసిన ప్రేక్షకులు.. తాజాగా విడుదలైన 'అక్క' ట్రైలర్‌ చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. ఇందులో ఆమె చూపించిన వైలెంట్ యాక్షన్ చూసి సినీ ప్రియులు షాకవుతున్నారు. కీర్తి సురేశ్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సరికొత్త వెబ్ సిరీస్ ట్రైలర్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తాజాగా విడుదల చేసింది. ట్రైలర్‌లోని యాక్షన్ సన్నివేశాలు, కథా నేపథ్యం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. 'అక్క' కథ పేర్ణూరు అనే ఓ వింత గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఈ ఊరిలో మగవాళ్ల పెత్తనం అస్సలు సాగదు. గత 800 ఏళ్లుగా మహిళలే రాచరికాన్ని కొనసాగిస్తున్నారు.

వివరాలు

'రుద్ర' పాత్రలో రాధికా ఆప్టే

ఆ రాజ్యానికి నాయకత్వం వహించే వ్యక్తిని అందరూ 'అక్క' అని పిలుస్తారు. గ్రామంలో ఇళ్ల పేర్లు సైతం మహిళల పేర్ల మీదే ఉంటాయి.

ఇక పెళ్లి అనే మాటకు అక్కడ ఎలాంటి విలువ ఉండదు. ప్రేమించుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ, ఒకరికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదనే తరహాలో అక్కడి వ్యవస్థ కొనసాగుతుంది.

ఈగ్రామంలో ఎవరైనా వ్యాపారం చేయాలంటే అక్కడి మహిళలకు కమీషన్ చెల్లించాల్సిందే. అలా చేయడానికి నిరాకరిస్తే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లేనని ట్రైలర్‌లో చూపించారు.

ఎన్నో రౌడీ గ్యాంగులను మట్టికరిపించిన చరిత్ర ఈ మహిళల సొంతం. ఎవరికీ లొంగని ఈ మహిళల కోటను సవాల్ చేస్తూ 'రుద్ర' పాత్రలో రాధికా ఆప్టే ఎంట్రీ ఇస్తుంది. ఆమె రాకతో కథలో అసలు పోరాటం మొదలవుతుంది.

వివరాలు

ఉత్కంఠభరితంగా కథ

ఇది బాంబే కాదు.. ఇక్కడ తుపాకీ బుల్లెట్లతో గొడవలు సర్దుమణగవు, చంపడమే ఒక బిజినెస్" అంటూ రాధికా ఆప్టే చెప్పే డైలాగులు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి.

ఈమాటలతోనే పేర్ణూరులో పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయో అర్థమవుతుంది.

మరోవైపు అక్కల రాజ్యాన్ని కూల్చేందుకు రుద్ర చేసే ప్రయత్నాలు కథను మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి.

ఆమె ఆడదాని రూపంలో ఉన్న ఒక రాక్షసి.. ఆ రాక్షసిని నేనే అంతం చేస్తానంటూ రుద్ర చేసే ప్రకటన ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అక్కల ఆధిపత్యాన్ని అంతం చేయడానికి ఆమె ప్రారంభించే పోరాటం కథలో కీలక మలుపుగా కనిపిస్తోంది.

రక్తం ఏరులై పారే సన్నివేశాలు, మైండ్ గేమ్స్, అధికారం కోసం జరిగే భీకర పోరాటాలతో ట్రైలర్‌ను ఉత్కంఠభరితంగా రూపొందించారు.

ADVERTISEMENT

వివరాలు

వైలెంట్ పాత్రలో కనిపించడం గమనార్హం

ఇందులో కీర్తి సురేశ్, రాధికా ఆప్టే తమ నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఇప్పటివరకు అమాయకమైన పాత్రల్లో ఎక్కువగా కనిపించిన కీర్తి సురేశ్.. ఈ సిరీస్‌లో పూర్తిగా భిన్నమైన, వైలెంట్ పాత్రలో కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

రాధికా ఆప్టే కూడా 'రుద్ర' పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇద్దరి మధ్య జరిగే పోరాటం, అధికారాన్ని దక్కించుకునేందుకు సాగే ఎత్తుగడలు ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి.

మొత్తానికి, యాక్షన్, రక్తపాతం, మైండ్ గేమ్స్, అధికారం కోసం జరిగే పోరాటాలతో 'అక్క' ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది.

అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

ADVERTISEMENT