NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / బీజేపీ కోసం ప్రచారంలో పాల్గొంటానని చెప్పిన స్టార్ హీరో
    తదుపరి వార్తా కథనం
    బీజేపీ కోసం ప్రచారంలో పాల్గొంటానని చెప్పిన స్టార్ హీరో
    బీజేపీ తరపున ప్రచారంలో పాల్గొననున్న సుదీప్

    బీజేపీ కోసం ప్రచారంలో పాల్గొంటానని చెప్పిన స్టార్ హీరో

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 05, 2023
    06:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటకలో ఎన్నికల నగారా మోగింది. అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారానికి సిద్ధమవుతున్నాయి.

    కర్ణాటకలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది అందరికీ ఆసక్తిగా ఉంది. తాజాగా కర్ణాటక ఎలక్షన్ల విషయంలో సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది.

    భారతీయ జనతా పార్టీ తరపున ప్రచారం చేయడానికి స్టార్ హీరో సుదీప్ వచ్చేస్తున్నాడు. ఈ మేరకు సుధీప్ స్వయంగా వెల్లడి చేసాడు. తాను ఏ పార్టీలో చేరట్లేదనీ, అలాగే ఎన్నికల్లో పోటీ చేయట్లేదని స్పష్టం చేస్తూ, బీజీపీ తరపున ప్రచారంలో పాల్గొంటానని మాత్రం అన్నాడు.

    ఇదే సమయంలో తనకు వచ్చిన బెదిరింపు లేఖల గురించి మాట్లాడాడు సుదీప్.

    సుదీప్

    ఫిలిమ్ ఇండస్ట్రీ నుండి బెదిరింపు లేఖలు

    కన్నడ స్టార్ హీరో సుదీప్ కు బెదిరింపు లేఖలు వచ్చాయి. తన ప్రైవేట్ వీడియోస్ బయటపెడతామంటూ అతనికి లేఖలు అందాయి. ఈ విషయమై మాట్లాడిన సుదీప్, ఆ లేఖలు ఎక్కడి నుండి వచ్చాయో తనకు తెలుసని అన్నాడు.

    ఫిలిమ్ ఇండస్ట్రీ నుండి ఆ లేఖలు వచ్చాయని సుదీప్ తెలిపాడు. ఈ బెదిరింపు లేఖల విషయంలో బెంగళూరులో కేస్ ఫైల్ చేసాడు సుదీప్.

    ఇదిలా ఉంటే, విక్రాంత్ రోనా తర్వాత సుదీప్ తన తర్వాతి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. విక్రాంత్ రోనాతో మంచి విజయం అందుకున్నాక, ఉపేంద్ర హీరోగా వచ్చిన కబ్జా మూవీలో అతిధి పాత్రలో కనిపించాడు సుజిత్.

    తన నెక్స్ట్ సినిమా మరికొద్ది రోజుల్లో మొదలవుతుందని చెప్పాడు సుదీప్.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    సినిమా

    #VNRtrio: నితిన్ సినిమాకు చిరంజీవి క్లాప్, వెంకీతో సినిమా ఉన్నట్టేనా? తెలుగు సినిమా
    ఏజెంట్ సెకండ్ సింగిల్: తెలంగాణ యాసతో రొమాంటిక్ టచ్, అదరగొట్టేసారు తెలుగు సినిమా
    రంగమార్తాండ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ తెలుగు సినిమా
    జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడంటున్న నారా రోహిత్ జూనియర్ ఎన్టీఆర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025