LOADING...
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ 'G.O.A.T' మూవీకు యూ/ఏ సర్టిఫికేట్..!
సుడిగాలి సుధీర్ 'G.O.A.T' మూవీకు యూ/ఏ సర్టిఫికేట్..!

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ 'G.O.A.T' మూవీకు యూ/ఏ సర్టిఫికేట్..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 15, 2026
05:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

వెండితెరపై తన ప్రత్యేక గుర్తింపు తో ప్రదర్శన ఇచ్చిన సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ 'G.O.A.T' (Greatest of All Time), యాక్షన్, కామెడీ, ఎమోషన్ కలిపిన స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందింది. దీని వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ ప్రేక్షకులను కూడా అలరించనుందని స్పష్టమైంది. చిత్ర నిర్మాణ సంస్థ 'మహాతేజ క్రియేషన్స్' సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ విడుదల చేస్తూ మార్చి 26 నుంచి బాక్సాఫీస్‌లో బ్లాక్‌బస్టర్ సినిమాటిక్ స్టార్మ్ మొదలవుతుందని ప్రకటించింది.

Details

మార్చి 26న గ్రాండ్ గా విడుదల

పోస్టర్‌లో సుధీర్, హీరోయిన్ దివ్య భారతి మధ్య కెమిస్ట్రీని చూపిస్తూ, సుధీర్ తన మాస్ ఇమేజ్ తో పాటు క్లాస్ లుక్ లో కూడా మెప్పించబోతున్నాడు. ఈ చిత్రంలో సుధీర్, దివ్య భారతి ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా మొగుళ్ల చంద్రశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమాను వేదవ్యాస్ అకుల దర్శకత్వంలో రూపొందించగా, సంగీతాన్ని లియన్ జేమ్స్ - మనీష్ శర్మ సమకూర్చారు. మహాతేజ క్రియేషన్స్ పతాకంపై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది.

Advertisement