LOADING...
Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు డబుల్ సర్ప్రైజ్.. ఒకే రోజు రెండు అప్‌డేట్లు
Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు డబుల్ సర్ప్రైజ్.. ఒకే రోజు రెండు అప్‌డేట్లు

Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు డబుల్ సర్ప్రైజ్.. ఒకే రోజు రెండు అప్‌డేట్లు

వ్రాసిన వారు Moogati Shabari
Mar 13, 2026
06:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు మార్చి నెల ప్రత్యేకంగా మారబోతోంది. 'రంగస్థలం' సక్సెస్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం 'ఆర్‌సీ 17'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. 'పుష్ప 2' విజయానంతరం సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కావడంతో సినీ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసే అవకాశముందని సమాచారం. అదే సమయంలో చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభమవుతుందనే వివరాలను కూడా వెల్లడించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

వివరాలు

డబుల్ ధమాకా

ఇక మరోవైపు దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పీరియడ్ క్రీడా కథా చిత్రం 'పెద్ది'లో కూడా రామ్ చరణ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీ ఏప్రిల్ 30న విడుదల కానుండటంతో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. ఒకే రోజు రెండు చిత్రాల నుంచి అప్‌డేట్లు రావడంతో మార్చి 27న రామ్ చరణ్ అభిమానులకు డబుల్ సర్ప్రైజ్ లభించనుంది.

Advertisement