NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Jaat Movie Teaser: స‌న్నీ డియోల్ 'జాట్' టీజ‌ర్ రిలీజ్
    తదుపరి వార్తా కథనం
    Jaat Movie Teaser: స‌న్నీ డియోల్ 'జాట్' టీజ‌ర్ రిలీజ్

    Jaat Movie Teaser: స‌న్నీ డియోల్ 'జాట్' టీజ‌ర్ రిలీజ్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 06, 2024
    04:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గత ఏడాది 'గదర్ 2' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే.

    ఇప్పటికే బోర్డర్ 2 సినిమాలో నటిస్తున్న ఈ స్టార్, తాజాగా తెలుగు దర్శకుడితో ఓ చిత్రానికి పనిచేస్తున్నాడు.

    జాట్ పేరుతో వస్తున్న ఈ చిత్రానికి క్రాక్, వీర సింహారెడ్డి చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.

    చిత్రబృందం ఇప్పటికే ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా, ఇప్పుడు టీజర్‌ను కూడా రిలీజ్ చేసింది.

    వివరాలు 

     బాలీవుడ్‌లోకి గోపీచంద్ మలినేని 

    టీజర్‌ను చూస్తే, సన్నీ డియోల్ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నట్లు స్పష్టమవుతుంది.

    ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

    రణ్‌దీప్ హుడా ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తుండగా, టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

    రిషి పంజాబి సినిమాటోగ్రాఫర్‌గా, అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.

    పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంతో గోపీచంద్ మలినేని బాలీవుడ్‌లోకి అడుగుపెడుతుండటం ఇండస్ట్రీలో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీజర్

    తాజా

    Miss World 2025: నేటి నుంచి మిస్‌ వరల్డ్‌ కాంటినెంటల్‌ ఫినాలే తెలంగాణ
    Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై కీలక సమాచారం.. నేరుగా లబ్దిదారుల ఆకౌంట్లలోకి నిధులు తెలంగాణ
    Stock Market: స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు  స్టాక్ మార్కెట్
    Raj Bhavan: తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ కలకలం.. హార్డ్‌డిస్క్‌లు అపహరించిన నిందితుడు  తెలంగాణ

    టీజర్

    రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ టీజర్: రణ్వీర్, ఆలియా ప్రధాన పాత్రల్లో ప్రేమకథ  బాలీవుడ్
    సలార్ టీజర్ రిలీజ్ కు కొత్త డేట్: ఈసారైనా అభిమానుల ఆశ నెరవేరుతుందా?  ప్రభాస్
    ఏపీ సీఎం జగన్ బయోపిక్: వ్యూహం సినిమా టీజర్ విడుదల ఎప్పుడో చెప్పేసిన ఆర్జీవీ  సినిమా
    నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు: చైతన్ కృష్ణ 'బ్రీత్' మూవీ టీజర్ విడుదల  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025