
Athamma Kitchens-Mega Family: వెల్కమ్స్ టూ అత్తమ్మా కిచెన్.. మెగా ఫ్యామిలీ సందడి
ఈ వార్తాకథనం ఏంటి
ఇంట్లో ఆడాళ్లందరూ కలసి వంట చేస్తే....ఇంట్లో ఏదో శుభకార్యమో లేదో పండుగకోసమో అనుకుంటాం.
కానీ ఈ వీడియోలో చూస్తున్న మహిళామణులంతా కలసి అత్తమాస్ కిచెన్(Athamma Kitchens) స్టార్ట్ చేసి ఆవకాయ పచ్చళ్లు ఆన్ లైన్ వ్యాపారం మొదలెట్టేశారు.
మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ బర్త్ డే రోజున ఈ పికెల్స్ వ్యాపారం ప్రారంభించిన వీరంతా ఆ రోజు సరదాగా తీసుకున్న ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే బాగా వైరల్ అయ్యింది.
సాంప్రదాయ రుచుల్లో భాగంగా మనం ఇంట్లో చేసుకునే వంటకాల్లానే వీరి ప్రోడక్ట్స్ ఉండనున్నట్లు వీడియో చూస్తూ తెలిసిపోతోంది.
Details
ఏం పని లేక ఇక్కడ కూర్చున్నాను
సురేఖ చేస్తోన్న అవకాయ పచ్చడిని చూస్తుంటే నోరూరి గుటకలు మింగేయటం ఖాయం.
ఈ వీడియోలో మొదట చిరంజీవి (Chiranjeevi) తల్లి అంజనా దేవి (Anjana Devi)కనిపిస్తోంది.
ఉపాసన (Upasana) వెళ్లి ఏంటి నాయనమ్మా...అంత సీరియస్ గా ఉన్నారని అడుగుతుంటుంది.
దానికి సమాధానంగా అంజనాదేవి ఏం పని లేక ఇక్కడ కూర్చున్నాను అంటుంది.
తర్వాత అలాగే కెమెరాను సురేఖ (Surekha) దగ్గరకు తీసుకెళ్తుంది ఉపాసన.
అక్కడ అత్తమ్మా క్యా హోరా అత్తమ్మా అని అడుగుతుంది సురేఖ.
ఇకవీడియో చివర్లో వెల్కమ్స్‌టూ అత్తమ్మా కిచెన్ అంటూ వారిద్దరూ వీడియోను ఎండ్ చేస్తారు.
ఈ వీడియోను చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.